హిట్ లేదని సినిమాలు ఆపేస్తుందా?

గత ఏడాది సంక్రాంతికి ఎఫ్ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరోయిన్ మెహ్రీన్ కౌర్ కి ఎఫ్ 2 కి ముందు, తర్వాత కూడా [more]

Update: 2020-07-22 09:16 GMT

గత ఏడాది సంక్రాంతికి ఎఫ్ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరోయిన్ మెహ్రీన్ కౌర్ కి ఎఫ్ 2 కి ముందు, తర్వాత కూడా హిట్స్ లేవు. ఎఫ్ 2 తర్వాత ఎంత మంచివాడవురా, అశ్వద్ధామ చిత్రాలతో ప్లాప్ కొట్టింది. పెద్దగా అవకాశాలు లేని మెహ్రీన్ కౌర్ కనీసం గ్లామర్తో అయినా కెరీర్ కొనసాగిస్తుంది అంటే.. మెహ్రీన్ గ్లామర్ గా కనిపించడానికి రెడీ అయినా.. ఆమె కి గ్లామర్ షో అంతగా మెప్పించదు. గ్లామర్ గా మెహ్రీన్ అందాలు అంతగా అనిపించవు. ఎంతగా ఎక్సపోజ్ చేసినా ట్రెడిషనల్ లుక్ లోనే కనబడే మెహ్రీన్ ఇప్పుడు ఓ నిర్ణయం తీసుకుంది అనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది.

తెలుగు, తమిళ లో ఆఫర్స్ తగ్గిన మెహ్రీన్ ఇప్పుడు సినిమాలకు గుడ్ బై  చెప్పబోతుంది ఆనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ ముగిసిన మళ్ళీ హీరోయిన్స్ కి పూర్వ వైభవం వస్తుంది అనేది కల్లే అని మెహ్రీన్ కి తెలిసొచ్చిందేమో అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఏదైనా వ్యాపారమో.. లేదంటే పెళ్ళో చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలని భావిస్తున్నట్టుగా టాక్. అయితే ఓటిటి గనక బాగా క్లిక్ అయితే మెహ్రీన్ అందులో ట్రై చేస్తుందేమో.. మరోపక్క తక్కువ పారితోషకాన్ని కన్నడ నుండి కాల్స్ వస్తున్నాయనే టాక్ ఉంది. మరి మెహ్రీన్ ఏం డెసిషన్ తీసుకుంటుందో తెలియాలి.

Tags:    

Similar News