ఈ సినిమా అయినా కాపాడుతుందా..?

Update: 2018-06-25 08:45 GMT

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి మంచి హిట్స్ అందుకున్న మెహరీన్ కౌర్ తన బరువు కారణంగా సూపర్ హిట్ సినిమాల్లో అవకాశాలు కోల్పోయింది. ఆమె లావు కారణంగా దర్శకనిర్మాతలు ఆమెని తమ సినిమాల్లో తీసుకోవడానికి వెనకాడుతున్నారు. కాకపోతే ప్రస్తుతం మెహ్రీన్ కౌర్ వర్కౌట్స్ గట్రా చేసి నాజూగ్గానే తయారైంది. ఇక రాజా ది గ్రేట్ సినిమా నుండి గ్లామర్ డోస్ కూడా పెంచింది. అయినా ఆమెకి మరీ ఎక్కువగా అవకాశాలు మాత్రం రావడం లేదు. కానీ బాగా బొద్దుగా ఉండి... సన్నగా నాజూగ్గా తయారైన రాశి ఖన్నా మాత్రం మంచి అవకాశాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం మెహరీన్ కూడా ట్రాక్ ఎక్కినట్టే అనిపిస్తుంది.

గ్లామర్ గేట్లు కూడా ఎత్తేసింది..

గోపీచంద్ తో కలిసి పంతం సినిమా చేస్తున్న మెహరీన్ కి ఆ సినిమాలో హీరోని ప్రేమించమని వెంటపడే కేరెక్టర్. మరి ఈ సినిమాలో మెహరీన్ గ్లామర్ షో బాగానే ఉంది. అందాలు ఆరబొయ్యకపోతే కష్టమని భావించిందేమో అందుకే.. ఈసారి గ్లామర్ గేట్స్ ఎత్తెయ్యడానికి ఫుల్ గా ప్రిపేర్ అయినట్టుగానే కనబడుతుంది. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తొలిప్రేమలో బరువు కారణంగా వరుణ్ తేజ్ పక్కన మిస్ అయిన మెహరీన్ కౌర్ ఈసారి ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అదేనండి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ - వరుణ్ తేజ్ ల మల్టీస్టారర్ లో వరుణ్ తేజ్ పక్కన నటిస్తుంది.

ఇద్దరికీ హిట్ అవసరమే..

మరి మెహరీన్ కి పంతం హిట్ ఎంత ముఖ్యమో.. అనేది ప్రస్తుత టాపిక్. ఈ సినిమా అటు ఇటు అయితే.. ఇక అమ్మడుకి మిగిలేది ఎఫ్ 2 లో ఫ్రస్టేషన్ మాత్రమే. అందుకే ఆమెకు పంతం సినిమా హిట్ ముఖ్యం. అలాగే ఈ సినిమా తో గోపీచంద్ కూడా హిట్ కొట్టాలి. లేదంటే గోపీచంద్ కెరీర్ కూడా కష్టాల్లో పడుతుంది. చూద్దాం మెహరీన్ భవిష్యత్తుని పంతం ఏ తీరానికి చేరుస్తుంది అనేది.

 

Similar News