హీరో నచ్చలేదంటుంది... అడ్వాన్స్ ఇవ్వనంటుంది

Update: 2018-11-29 04:11 GMT

నిన్న బుధవారం మెగా హీరో అదేనండి మెగా ఫ్యామిలీ అల్లుడు కళ్యాణ్ దేవ్ రెండో ప్రాజెక్ట్ నుండి హీరోయిన్ మెహ్రీన్ కౌర్ తప్పుకుందని... అలాగే హీరో నచ్చక, కన్నుకొట్టి అందరిని పడేసిన ప్రియా ప్రకాష్ వారియర్ కూడా తప్పుకుందనే న్యూస్ మాములుగా వినబడలేదు. సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలోనూ ఈ న్యూస్ హాట్ హాట్ గా చక్కర్లు కొట్టింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే... మెగాస్టార్ చిరు అల్లుడు కళ్యాణ్ దేవ్ ఈమధ్యనే హీరోగా పరిచయం అయ్యాడు. అయితే కళ్యాణ్ దేవ్ రెండో సినిమా ని కొత్త దర్శకుడు పులి వాసు దర్శకుడిగా మొదలైంది. అసలు ఈ పులి వాసు ముందుగా సుధీర్ బాబు హీరోగా సినిమా ని మొదలెట్టాలనుకున్నాడు.

కానీ పులి వాసు డైరెక్షన్ లో తెరకెక్కబోయే సినిమా నిర్మాతకు, సుధీర్ బాబుకి గొడవలవడంతో... ఆ సినిమా ఆగిపోవడం.. అదే కథతో పులి వాసు కళ్యాణ్ దేవ్ హీరోగా సినిమా మొదలు పెట్టడం జరిగింది. అయితే సుధీర్ బాబు హీరోగా సినిమా మొదలవుతుందననుకున్నప్పుడు సుధీర్ బాబుకి పక్కన హీరోయిన్ గా మెహ్రీన్ కౌర్ ని ఫైనల్ చేసింది చిత్ర బృందం. కానీ సుధీర్ బాబు తప్పుకోవడం తో, ఆ ప్లేస్ లోకి కళ్యాణ్ దేవ్ వచ్చి చేరాడు. అయితే సుధీర్ బాబు హీరోగా అయితే ఓకె, కళ్యాణ్ దేవ్ అయితే సినిమా చెయ్యనని మెహ్రీన్ ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. అలాగే సుధీర్ బాబుతో సినిమా అన్నప్పుడు మెహ్రీన్ ని 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి ఫైనల్ చేశారట.

కానీ ఇప్పుడు కళ్యాణ్ దేవ్ హీరో అనేటప్పటికీ... ఆ సినిమా చెయ్యనున్న మెహ్రీన్ ఇప్పుడు అడ్వాన్స్ కూడా ఇవ్వనంటుందట. మరి హీరోనిమార్చి మోసం చేసారంటూ ఫైర్ అవుతుందట. పాపం మెగా హీరో కళ్యాణ్ కి ఎన్ని కష్టాలు. ముందు ప్రియా ప్రకాష్ తప్పుకుంటే ఇప్పుడు మెహ్రీన్ తప్పుకుని షాక్ ఇచ్చింది. కానీ నిర్మాతలు మాత్రం హీరో ఎవ్వరైనా మెహ్రీన్ సినిమా చెయ్యాల్సిందే అంటున్నారట. మరి మెహ్రీన్ ఆ సినిమా నుండి తప్పుకుంటే తప్పుకుంది... కనీసం అడ్వాన్స్ అన్నా వెనక్కి ఇస్తే మరో హీరోయిన్ ని వెతుక్కుంటారు నిర్మాతలు.

Similar News