మెహ్రీన్ ఏంటమ్మా ఆ స్పీడ్!

Update: 2018-05-03 06:58 GMT

టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోయిన్స్ లో మెహ్రీన్ ఒక్కరు. ఆమె ఒక నటనతోనే కాదు గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పటివరకు మీడియం సినిమాలకే పరిమితం అయిన ఈ సుందరికి వెంకటేష్ - వరుణ్ తేజ్ మల్టీ స్టారర్ లో ఛాన్స్ కొట్టేసింది.

నోటా సినిమాలో...

అంతేకాకుండా గోపీచంద్ తో 'పంతం'...విజయ్ దేవరకొండ ద్విభాషా చిత్రంగా రూపొందుతోన్న 'నోటా' సినిమాలోనూ నటిస్తోంది. ఇలా వరస ప్రాజెక్ట్స్ పై సైన్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడి చేతిలోకి మరో ఆఫర్ వచ్చి పడింది. యంగ్ హీరో నితిన్ కు జోడీగా చేసే ఛాన్స్ అమ్మడికి దక్కడం విశేషం.

తర్వాత నితిన్ తో....

ప్రస్తుతం హీరో నితిన్ సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో 'శ్రీనివాస కల్యాణం' చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు అరవై శాతం కంప్లీట్ అయిపోయింది. ఈ మూవీలో నితిన్ కు జోడిగా రాశీ కన్నా చేస్తుంది. ఈ సినిమా తర్వాత నితిన్ 'ఛలో' సినిమాను తీసిన వెంకీ కుడుములతో ఒక సినిమాను ఒకే చేసాడు. ఆ మూవీలో హీరోయిన్ మెహ్రీన్ అయితే బాగుంటాదని భావించి ఆమెను సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. నితిన్ సొంత బ్యానర్లో ఈ సినిమాను రూపొందించనున్నారు. ఇలా వరస సినిమాలతో మంచి స్పీడ్ మీద ఉంది మెహ్రీన్.

Similar News