మెహ్రీన్ ఎందుకలా చేస్తుంది..!

Update: 2018-10-01 06:32 GMT

మెహ్రీన్ కౌర్ కి ప్రస్తుతం హిట్స్ లేకపోయినా.. చేతిలో సినిమాలకు కొదవేం లేదు. రాజా ది గ్రేట్ తో హిట్ అందుకున్నప్పటికీ... ఆ సినిమాలో మెహరీన్ బరువు మీద బాగా కామెంట్స్ పడ్డాయి. బబ్లీగా బొద్దుగా ఉండే మెహ్రీన్ కౌర్ ఈ మధ్యన కాస్త బరువు తగ్గినట్టుగానే కనబడుతుంది. జిమ్ లో వర్కౌట్స్ చేసిందో ఏమో కొద్దిగా బరువు తగ్గినా.. మెగ్రీన్ లో ఆ బబ్లీనెస్ మాత్రం మిస్ కాలేదు. తాజాగా మెహ్రీన్ తెలుగులో వెంకటేష్, వరుణ్ తేజ్ లతో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్ 2 ఫన్ అండ్ ప్రష్టేషన్ లో తమన్నాతో పాటుగా నటిస్తుంది. ఇక తమిళంలో విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన నోటా శుక్రవారం ప్రేక్షకుల ముందుకురాబోతుంది.

ప్రమోషన్స్ కి దూరంగా...

అయితే నోటా సినిమాలో మెహ్రీన్... విజయ్ సరసన నటిస్తుంది అని నోటా మొదలైనప్పుడు మొన్నామధ్యన తెలిసింది. కానీ ఈమధ్య కాలంలో నోటాలో మెహ్రీన్ హీరోయిన్ అనే విషయం అందరూ మర్చిపోయారు. ఎందుకంటే నోటా టీజర్ లో కానీ, ట్రైలర్ లో కానీ మెహ్రీన్ ఎక్కడా కనబడకపోవడం ఒక కారణమైతే.. మెహ్రీన్ కౌర్ ని నోటా ప్రమోషన్స్ కి దూరం పెట్టారా? లేక ఆమె కావాలని దూరమైందా? అనేది క్లారిటీ రావడం లేదు గానీ.. కచ్చితంగా మెహ్రీన్ కౌర్ నోటా సినిమా ప్రమోషన్స్ లో ఎక్కడా కనబడడం లేదు. కేవలం విజయ్ దేవరకొండ సోలోగా నోటా ప్రమోషన్స్ చేస్తున్నాడు. నిన్నమొన్నటివరకు విజయ్ కూడా నోటా విషయం పట్టించుకోలేదు. కానీ తాజాగా రంగంలోకి దిగిన విజయ్ దేవరకొండ తెలుగు, తమిళ ప్రమోషన్స్ కోసం చెన్నయ్ కి, హైదరాబాద్ కి ఎక్కే ఫ్లైట్ ఎక్కడం దిగే ఫ్లైట్ దిగడం చేస్తున్నాడు.

చివరకు పబ్లిక్ మీట్ కు...

కానీ మెహ్రీన్ మాత్రం నిన్నటివరకు చడీ చప్పుడు లేదు. అయితే మెహ్రీన్ నోటా ప్రమోషన్స్ కి దూరం కావడానికి కారణం మెహ్రీన్ పాత్రకి నోటాలో ప్రాధాన్యత లేకపోవడం వల్లనే మెహ్రీన్ నోటా విషయంలో లైట్ తీసుకుందట. మరో పక్క మెహ్రీన్ ఎఫ్ 2 షూటింగ్ లో విదేశాల్లో ఉండడం వలనే నోటా ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోతుందనే టాక్ ఉంది. అందుకే అందరూ నోటా ప్రమోషన్స్ ఈవెంట్స్ అయిన ప్రెస్ మీట్, ఇంటర్వూస్ ఇలా ఏ ఈవెంట్ లోను మెహ్రీన్ కనబడకపోయేసరికి అసలు మెహ్రీన్ కి ఏమైంది.... అంటూ ఆరాలు తియ్యడం మొదలు పెట్టారు. కాకపోతే నిన్న రాత్రి జరిగిన నోటా పబ్లిక్ మీట్ మెహ్రీన్ మెరవడం మాత్రం కాస్త ఊరటనిచ్చింది. మరి మెహ్రీన్ వరకు ఈ విషయాలు చేరాయేమో.. హడావిడిగా నోటా పబ్లిక్ మీట్స్ కి మెహ్రీన్ వచ్చేసింది. మరి సినిమా విడుదలయ్యేలోపు మెహ్రీన్ నోటా ఇంటర్వూస్ తో కాస్త సందడి చేస్తే బావుంటుంది.

Similar News