మెహ్రీన్ కూడా ఆ హీరోలతోనేనా..?

ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ తో టాప్ మోస్ట్ హీరోలతో జోడీ కడుతుంది అనుకుంటే.. అవకాశాల కోసం వెతుక్కోవాల్సి వచ్చింది మెహ్రీన్ కౌర్ కి. లావుగా [more]

Update: 2019-05-28 08:31 GMT

ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ తో టాప్ మోస్ట్ హీరోలతో జోడీ కడుతుంది అనుకుంటే.. అవకాశాల కోసం వెతుక్కోవాల్సి వచ్చింది మెహ్రీన్ కౌర్ కి. లావుగా ఉన్నందుకే అవకాశాలు రావడం లేదనుకున్న ఈ భామ ఒళ్లు బాగా తగ్గించి గ్లామర్ గా తయారైంది. అయినా యంగ్ హీరోల చూపు మెహ్రీన్ మీద పడటం లేదు. తాజాగా గోపీచంద్ సరసన హీరోయిన్ గా చేస్తున్న మెహ్రీన్ కౌర్ కి సీనియర్ హీరోలు ఆఫర్స్ ఇస్తునట్లుగా వార్తలొస్తున్నాయి. మెహ్రీన్ ని స్టార్ హీరోలే కాదు.. యంగ్ హీరోలు కూడా పట్టించుకోవడం లేదు.

బాలయ్య సినిమాలో ఛాన్స్

ఎఫ్ 2 లాంటి హిట్ ఉన్న మెహ్రీన్ కి అవకాశాలు కొరవయ్యాయి. ఇక సీనియర్ హీరోలతో మెహ్రీన్ సర్దుకుపోయేలానే కనబడుతుంది. గోపీచంద్ సరసన నటిస్తున్న మెహ్రీన్ కి ఇపుడు మరో సీనియర్ హీరో బాలకృష్ణ సినిమాలో అవకాశమొచ్చినట్లు ఫిలింనగర్ టాక్. సి.కళ్యాణ్ నిర్మాతగా.. బాలకృష్ణ – రవికుమార్ కాంబినేషన్ లో వస్తున్న రూలర్ అనే చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్ అంటూ ప్రచారం జరుగుతుంది. ముందు పాయల్ రాజపుట్ అని ప్రచారం జరిగినా.. తాజాగా ఆ లిస్ట్ లోకి మెహ్రీన్ వచ్చింది. ఇక ఆర్ఎక్స్ 100తో అదిరిపోయే హిట్ కొట్టిన పాయల్ కి కూడా సీనియర్ హీరోల సరసనే అవకాశాలు వస్తున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News