మెహ్రీన్ కు ఇప్ప‌టికి ల‌క్ ఫేవ‌ర్ చేసిందా..?

కెరీర్ లో హిట్స్, ఫ్లాప్స్ ఉన్న హీరోయిన్స్ కి లక్ అనేది ఎంత ముఖ్యమో ఇలా వచ్చి అలా వెళ్లిపోయే చాలామంది హీరోయిన్స్ ని చూస్తుంటే తెలుస్తుంది. [more]

Update: 2019-05-10 07:39 GMT

కెరీర్ లో హిట్స్, ఫ్లాప్స్ ఉన్న హీరోయిన్స్ కి లక్ అనేది ఎంత ముఖ్యమో ఇలా వచ్చి అలా వెళ్లిపోయే చాలామంది హీరోయిన్స్ ని చూస్తుంటే తెలుస్తుంది. తాజాగా ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఎఫ్ 2లో హీరోయిన్ గా నటించిన మెహ్రీన్ కౌర్ కి స్టార్ హీరోల నుండి అవకాశాలొస్తాయని అంతా అనుకున్నారు. కేవలం ప్రేక్షకులే కాదు… ఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ తో టాప్ పొజిషన్ లోకి వెళ్దామనుకున్న మెహ్రీన్ కౌర్ కి ఓ అన్నంత అవకాశాలు రాలేదు. మొన్నీమధ్యనే యాక్షన్ హీరో గోపీచంద్ సరసన ఛాన్స్ పట్టింది. గోపీచంద్ సరసన ఇప్పటికే షూటింగ్ లో పాల్గొంటుంది.

నాగ‌శౌర్య సినిమాలో ఛాన్స్

ఇక తాజాగా మెహ్రీన్ సుడి తిరిగినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మరో యంగ్ హీరో సరసన మెహ్రీన్ ఛాన్స్ పట్టినట్లుగా ఫిలింనగర్ టాక్. ప్రస్తుతం రెండు మూడు సినిమాలకు బ్రేకప్ చెప్పి తాజాగా ఒక నూతన దర్శకుడితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాగ శౌర్య. నాగ్ శౌర్య చెయ్యాల్సిన రెండు సినిమాలు ఆగిపోయాయి. ప్రస్తుతం శ్రీనివాస అవసరాల దర్శకత్వంలో నటిస్తున్న నాగ శౌర్య ఓ కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఆ కొత్త దర్శకుడి డైరెక్షన్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్ గా నటించనుందని అంటున్నారు. ఇక ఈ సినిమా నాగ శౌర్య ఓన్ బ్యానర్ లో తెరకెక్కనుంది. మరి నాగ శౌర్య సరసన ఛాన్స్ తో మెహ్రీన్ మళ్లీ లైం టైంలోకి వ‌స్తుందేమో చూడాలి.

Tags:    

Similar News