ఇప్పటికైనా హనీ బిజీ అయ్యేనా..!

చబ్బీ చీక్స్ తో కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమాలో చెప్పానా.. నేను చెప్పానా.. అంటూ అందరినీ మైమరపించిన మెహరీన్ కౌర్ మీడియం రేంజ్ హీరోలతో చాలానే [more]

Update: 2019-01-22 06:04 GMT

చబ్బీ చీక్స్ తో కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమాలో చెప్పానా.. నేను చెప్పానా.. అంటూ అందరినీ మైమరపించిన మెహరీన్ కౌర్ మీడియం రేంజ్ హీరోలతో చాలానే సినిమాలు చేసింది. మెహరీన్ నటించిన కొన్ని సినిమాలు యావరేజ్ కాగా.. మరికొన్ని డిజాస్టర్స్ అయ్యాయి. అయితే మధ్యలో బరువు కూడా ఆమెకి సమస్యగా మరింది. మరీ బొద్దుగా ఉన్న ఆమెకు అవకాశాలు తగ్గాయి. రాజా ధి గ్రేట్ సినిమాలో గ్లామర్ షో చేసిన మెహరీన్ పాటల్లో డాన్స్ చేసేటపుడు బాగా లావుగా కనబడింది. అప్పటికే చేతిలో ఉన్న నోటాలో కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ.. వెంకటేష్, వరుణ్ తేజ్ ల ఎఫ్ 2 టైంకి చిక్కింది.

బాగా బరువు తగ్గి

ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమాలో వరుణ్ కి జోడిగా హనీ పేరుతొ హనీ ఈజ్ ది బెస్ట్ అంటూ ఒక వెరైటీ మేనేరిజంతో ఆకట్టుకుంది మెహరీన్ కౌర్. ఆ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే మెహరీన్ జిమ్ లో బరువు తగ్గేందుకు ఎంతగా వర్కౌట్స్ చేసిందో కానీ… ఎఫ్ 2 లోని కొన్ని సీన్స్ లో బాగా చిక్కినట్టుగా కనబడింది. మోహంలో ఇదివరకటి గ్లో కనిపించలేదు. ఇక ఇప్పటికే మెహరీన్ కు టాలీవుడ్ లో పారితోషకం సమస్యతో పాటు సినిమా ప్రమోషన్స్ కి హ్యాండ్ ఇస్తుందనే టాక్ ఉంది.

మంచి రోల్ వచ్చినా…

ఇక ఎఫ్ 2 హిట్ అయినా మెహరీన్ కు ఆ సినిమా హిట్ కలిసొచ్చేలా కనబడ్డం లేదు. ఎఫ్ 2 సినిమా తర్వాత మెహరీన్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. తాజాగా అవకాశాలిచ్చే కుర్ర హీరోలు కనిపించడం లేదు. ఇక ఎఫ్ 2లో హనీ ఈజ్ ది బెస్ట్ అన్న మెహరీన్ నిజంగానే తాను నటించిన సినిమాల్లో కెల్లా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఇచ్చింది. ఇక అనిల్ కూడా ఆరిపోతున్న దీపానికి నూనె పోసినట్టుగా మెహరీన్ కెరీర్ కి బెస్ట్ రోల్ ఇచ్చాడు. మరి ఎఫ్ 2 హిట్ మెహరీన్ కు ఎలాంటి మంచి చేస్తుందో చూద్దాం.

Tags:    

Similar News