మెహ్రీన్ లక్కీ ఛాన్స్ అంటే ఇదేనేమో?

తన అందంతో, క్యూట్ నెస్ తో, గ్లామర్ తో అందరిని ఫిదా చేసినా పంజాబీ హీరోయిన్ మెహ్రీన్ పిర్జా తెలుగులో నాని తో “కృష్ణ గాడి వీర [more]

Update: 2019-06-16 06:23 GMT

తన అందంతో, క్యూట్ నెస్ తో, గ్లామర్ తో అందరిని ఫిదా చేసినా పంజాబీ హీరోయిన్ మెహ్రీన్ పిర్జా తెలుగులో నాని తో “కృష్ణ గాడి వీర ప్రేమ గాథ” అనే సినిమాతో హిట్ అందుకుంది. ఆ తరువాత వరస ఆఫర్స్ వచ్చినా అంతగా క్లిక్ అవ్వలేకపోయింది. అయితే 2019 స్టార్టింగ్ లో వచ్చినా “ఎఫ్2″తో హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత గోపీచంద్ “చాణక్య” లో మెయిన్ లీడ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. దీనితో పాటు ఇప్పుడు లేటెస్ట్ గా మరో పెద్ద ఆఫర్ కొట్టేసింది ఈ అమ్మడు.

అది కూడా తమిళంలో. ధనుష్ హీరోగా నటిస్తున్న సినిమాలో అవకాశం కొట్టేసింది. ఆర్.ఐ దురై స్వామి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ మూవీని సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై టి.జి త్యాగరాజ్ నిర్మిస్తున్నారు. మెహ్రీన్ నటిస్తున్నట్టు తాజాగా సత్యజ్యోతి ఫిలింస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో దీనికి సంబందించిన ట్వీట్ చేశారు. మిగిలిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. తనకి 2019 గోల్డెన్ ఇయర్ లా ఉంది. పెద్ద ఆఫర్స్ వస్తున్నాయి.

Tags:    

Similar News