ఎఫ్ 3 లో ఉన్న అంటున్న హీరోయిన్?

అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో.. దిల్ రాజు దానికి సీక్వెల్ గా ఎఫ్ 3 తీద్దామని అనిల్ రావిపూడి [more]

Update: 2020-09-22 04:51 GMT

అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో.. దిల్ రాజు దానికి సీక్వెల్ గా ఎఫ్ 3 తీద్దామని అనిల్ రావిపూడి చెప్పడము, తర్వాత అనిల్ కి మహేష్ ఆఫర్ రావడంతో అనిల్ రావిపూడి మహేష్ తో సరిలేరు నీకెవ్వరూ సినిమా చేసాడు. అయినా దిల్ రాజ్ ఎఫ్ 3 ని వదల్లేదు. ఇక సరిలేరు తర్వాత అనిల్ రావిపూడి ఎఫ్ 3 స్క్రిప్ట్ పూర్తి చేసిన హీరో లెవరు ఖాళీగా లేకపోవడంతో అనిల్ కూడా గమ్మునున్నాడు. ఇక వచ్చే ఏడాదే ఎఫ్ 3 ఉంటుంది అని వెంకటేష్ ప్రకటించాడు. ఈలోపు వరుణ్ తేజ్ కూడా కాస్త ఫ్రీ అవుతాడు. కరోనా కారణంగా ఈ ఏడాదే మొదలవ్వాల్సిన ఎఫ్ 3 కాస్త వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయ్యింది. 

అయితే అనిల్ రావిపూడి వెంకీ – వరుణ్ లతోనే ఎఫ్ 3 మొదలు పెట్టిన.. మరో హీరోని ఇందులో ఇన్వాల్వ్ చెయ్యడంతో పాటుగా హీరోయిన్స్ ప్లేస్ లోకి కొత్తవారికి తీసుకుంటున్నారనే ప్రచారం జరగగా.. తాజాగా ఎఫ్ 2 భామ మెహ్రీన్ కౌర్ మాత్రం ఎఫ్ 3 లో నేనె హీరోయిన్ అంటుంది. నాతో పాటు ప్రైమరీ కాస్ట్ మొత్తం ఉంటుంది అని చెప్పిన మెహ్రీన్ కౌర్ ఒకప్పుడు డిప్రెషన్ తో బాధపడింది. డిప్రెషన్ నుండి బయటికి రావాలంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చెయ్యడం, మనల్ని మనం నమ్ముతూనే దేవుణ్ణి కూడా నమ్మాలంటుంది మెహ్రీన్. మరి సినిమాలు మానేస్తుంది అని ప్రచారం జరిగిన మెహ్రీన్ కౌర్ మాత్రం ఎఫ్ 3 తో తాను సినిమాలు వదలడం లేదని చెప్పకనే చెప్పింది. 

Tags:    

Similar News