మెహ్రీన్ ఫైటింగ్ చేస్తోందా..!

Update: 2018-08-23 10:16 GMT

టాలీవుడ్ లో హీరోయిన్స్ ఫైట్స్, స్టంట్స్ సీన్స్ చాలా తక్కువ మంది చేసి ఉంటారు. ఆలా చేయడానికి చాలా తక్కువ మందికి అవకాశం వస్తుంది. బాలీవుడ్ లో లాగా హీరోయిన్స్ తో రిస్కులు చేయించడానికి మన డైరెక్టర్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు. హీరోస్ తోనే అటువంటివి చేయించేలా చూసుకుంటారు. కానీ జక్కన్న బాహుబలిలో అనుష్క, తమన్నాతో ఫైట్స్ చేయించాడు. అదీ స్టోరీకి అవసరం కాబట్టి. అలానే గతంలో లేడీ అమితాబ్‌గా పేరు తెచ్చుకున్న విజయశాంతి ఇలా చాలానే ఫైట్లూ గట్రా చేసింది. ఇప్పుడు మరో క్యూట్ హీరోయిన్ ఫైట్స్ చేయనుంది. మరి విజయశాంతిలా కాకపోయినా అటుఇటుగా అనిల్ రావిపూడి ‘ఎఫ్‌2’ మెహరీన్ తో స్టంట్స్ చేయిస్తున్నాడు.

కొత్త ప్రయోగాలకు ముందుంటాను...

వరుణ్ తేజ్ - వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. అర్ధరాత్రి హీరోయిన్‌ని కారు ఢీ కొట్టే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ సీన్స్ చేయడం ఇదే నాకు తొలిసారి. కొత్తకొత్త ప్రయోగాలు చేయడానికి నేను ఎప్పుడూ ఆలస్యం చేయను. ఇదో కొత్త అనుభవం అని మెహరీన్ పేర్కొన్నారు. అనిల్ సుప్రీమ్ సినిమాలో రాశితో ఒక ఫైట్ చేయించాడు. కాకపోతే అది కామెడీ ఫైట్. మరి ఇందులో మెహ్రీన్ తో ఎటువంటి ఫైట్ చేయించుతున్నాడో అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Similar News