పర్ఫెక్ట్ గా లేకపోతె హ్యాండ్ ఇస్తారు అందుకే..!!

చిరు లాంటి హీరో దగ్గర పర్ఫెక్షన్ లేకపోతె ఏమవుతుందో అనేది లూసిఫెర్ రీమేక్ కి డైరెక్టర్ గా అనుకున్న సాహో డైరెక్టర్ సుజిత్ ని చూస్తే తెలుస్తుంది. [more]

Update: 2020-10-04 13:43 GMT

చిరు లాంటి హీరో దగ్గర పర్ఫెక్షన్ లేకపోతె ఏమవుతుందో అనేది లూసిఫెర్ రీమేక్ కి డైరెక్టర్ గా అనుకున్న సాహో డైరెక్టర్ సుజిత్ ని చూస్తే తెలుస్తుంది. లూసిఫెర్ రీమేక్ స్క్రిప్ట్ తో సరిగ్గా మెప్పించలేక సుజిత్ ఆ రీమేక్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. కానీ వేరే కారణాలతో సుజిత్ ఈ రీమేక్ నుండి తప్పుకున్నాడని మెగా కాంపౌండ్ చెబుతున్న మాట. అందుకే ఇప్పుడు మెహెర్ రమేష్ కూడా సుజిత్ కి జరిగింది తనకి జరక్కుండా కంగారు పడుతున్నాడట. ఎందుకంటే మెహెర్ రమేష్ చిరు తో వేదాళం రీమేక్ చెయ్యడానికి తయారవుతున్నాడు. ఇప్పటికే వేదాళం తెలుగు స్క్రిప్ట్ ని మెహెర్ రమేష్ రెడీ చేసి చిరు తో ఓకె చేయించుకున్నాడు.

ఇక స్క్రిప్ట్ ఓకె అయ్యాక మెహెర్ రమేష్ ఇప్పుడు వేదాళం రీమేక్ కోసం పర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది. ఎలాగూ ఆచార్య షూటింగ్ కంప్లీట్ అవడానికి టైం పడుతుంది. ఈలోపు మెహెర్ రమేష్ లొకేషన్స్ వేటలో ఉండి.. వాటిని కూడా చిరు తో ఓకె చేయించుకోవడానికి తహతహలాడుతున్నాడట. ఇక వేదలమ్ లోని కొన్ని కీలక ఎపిసోడ్స్ లోని లొకేషన్స్ లోనే చిరు సన్నివేశాలు కూడా తెరకెక్కించే ప్లాన్ లో మెహెర్ ఉన్నాడట. ఇక చిరు సిస్టర్ గా సాయి పల్లవి తో ఉన్న సీన్స్ ని కూడా ఒరిజినల్ లొకేషన్స్ లోనే చెయ్యాలని మెహెర్ ప్లాన్ గా చెబుతున్నారు. ఒరిజినల్ కి తక్కువకాకుండా తెలుగులో చిరు వేదాళం రీమేక్ ఉండాలని మెహెర్ ఆలోచనగా చెబుతున్నారు. మరి ప్లాప్ డైరెక్టర్ కదా ఈ మాత్రం కంగారు, పర్ఫెక్షన్ ఉండాలి మరి.

Tags:    

Similar News