అన్నీ పోయి.. మందు మిగిలింది!

Update: 2018-05-17 08:35 GMT

పూరి జగన్నాధ్ దర్శకత్వ నిర్మాణంలో ఆకాష్ పూరి - నేహా శెట్టి జంటగా తెరకెక్కిన మెహబూబా సినిమా మహానటి ముందు అడ్రెస్స్ గల్లంతైంది. పూరి కనెక్ట్స్ పేరుతొ ఛార్మి - పూరి సంయుక్తంగా నిర్మించిన మెహబూబా సినిమాని హిట్ చేయాలని చాలా పరితపించారు. సినిమా విడుదలై నెగెటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తమ సినిమా హిట్ అని సక్సెస్ మీట్స్, సక్సెస్ టూర్స్ అంటూ ఛార్మి అండ్ కో తెగ హల్చల్ చేస్తున్నారు. మరి పూరి జగన్నాధ్ తనకి తన మీద ఓవర్ కాన్ఫిడెన్స్ తో మొత్తం ఊడ్చి ఈ సినిమాని తెరకేక్కించాడు. కానీ అసలే ప్లాప్స్ లో ఉన్న పూరీని తన కొడుకు ఆకాష్ కూడా ఆదుకోలేకపోయాడు. ఇక పూరి జగన్నాధ్ అటు దర్శకుడిగానూ, ఇటు నిర్మాతగానూ ప్లాప్ ను మూడగట్టుకున్నాడు.

మందు గ్లాసుతో డ్యాన్సు....

కానీ అది ఒప్పుకోవడానికి ఛార్మి గాని పూరి గాని సిద్ధంగా లేరు. తమ మెహబూబా సినిమా హిట్ అని సోషల్ మీడియా లో ఎంతగా చెలరేరిగిపోతున్నారంటే మెహబాబా సక్సెస్ సెలెబ్రేషన్స్ అంటూ మందు పార్టీ చేసుకుంటున్నారు. పూరి జగన్నాధ్, ఛార్మి ఇంకా మెహబూబా టీమ్ లోని కొందరు మందు పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఆ పార్టీలో ఛార్మి మందు గ్లాస్ పట్టుకుని డాన్స్ చెయ్యడం మాత్రం అందరిని షాక్ కి గురి చేస్తుంది. హీరోయిన్ గా అవకాశాలు లేక పూరి తో చేరి పూరి కనెక్ట్స్ ని మెయిన్చే టెయిన్ చేస్తున్న ఛార్మి మెహబూబా పబ్లిసిటీ కార్యక్రమాల్లోనూ, షూటింగ్ విషయంలోనూ ఎంతలా హల్చల్ చేసిందో తెలిసిందే. కానీ మరీ పార్టీలో మందు గ్లాసులు పట్టుకుని ఈ డాన్స్ ఏంటి అంటూ నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఛార్మి మెహబూబాతో అన్ని పోగొట్టుకుంది కానీ మందు మిగిలింది అంటూ సైటర్లు కూడా వేస్తున్నారు.

Similar News