పాపం మేఘ ఆకాష్ నిజంగానే “అన్ లక్కీ”

లై, ‘ఛల్ మోహన్ రంగ’ సినిమాలతో తెలుగు తెరకు పరిచయం అయినా మేఘ ఆకాష్ కు తన మొదటి రెండు సినిమాలు డిజాస్టర్స్ అయినా ఆమెకు అవకాశాలు [more]

Update: 2019-09-08 07:50 GMT

లై, ‘ఛల్ మోహన్ రంగ’ సినిమాలతో తెలుగు తెరకు పరిచయం అయినా మేఘ ఆకాష్ కు తన మొదటి రెండు సినిమాలు డిజాస్టర్స్ అయినా ఆమెకు అవకాశాలు మాత్రం తగ్గలేదు. వాస్తవానికి ఆమె మొదటి చిత్రం లై కాదు. ఆమె మొదటి చిత్రం ‘ఎనైనోకి పాయుం తూటా'(తెలుగులో ‘తూటా’). అదేంటి ఇది రిలీజ్ కాలేదు కదా అనుకుంటున్నారా? ఒకవేళ రిలీజ్ అయ్యి ఉంటె ఇదే మొదటి అయేది. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అయింది కానీ ఈమూవీ షూటింగ్ టైములో తన టాలెంట్ నచ్చి ‘లై’.. ‘ఛల్ మోహన్ రంగ’ సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి.

తూటాకు మాత్రం….

తమిళంలో రజనీకాంత్ ‘పేట’ లో కూడా చేసింది. ఈ మూడు సినిమాలు రిలీజ్ అయినా తన మొదటి సినిమా అంటే ‘తూటా’ మాత్రం ఇంకా రిలీజ్ కాలేదు. ప్రస్తుతం హిందీ లో ‘శాటి లైట్ శంకర్’ సినిమాతో డెబ్యూ ఇస్తోంది. అంత బాగానే ఉంది కానీ ‘తూటా’ కు మాత్రం మోక్షం కలగలేదు. డైరెక్టర్ గౌతమ్ మీనన్ కి కి ఫైన్షియర్స్ కి మధ్య ఏదో గొడవలు ఉండడంతో ఈసినిమాను సెప్టెంబర్ 6 న విడుదల కానికుండా ఆపేసారు. పాపం ఇది ఒకరకంగా “బ్యాడ్ లక్” అనే చెప్పుకోవాలి. ఈమూవీ రిలీజ్ అయ్యి ఉంటే తన టాలెంట్ అందరికి తెలిసి మరిన్ని అవకాశాలు వచ్చేవి. ఈసినిమాలో ఈమె సరసన ధనుష్ నటిస్తున్నాడు. అయితే ఈమూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న క్లారిటీ లేదు.

Tags:    

Similar News