రజిని మూవీలో ఛాన్స్ కొట్టేసిన నితిన్ హీరోయిన్

Update: 2018-06-05 09:42 GMT

టాలీవుడ్ లో 'లై' సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయిన మెగా ఆకాష్ తన మొదటి సినిమాతోనే యూత్ మనసులు గెలుచుకుంది. తన క్యూట్ ఎక్స్ ప్రే షన్స్ తో అందరి మనసులు గెలుచుకున్న ఈ బ్యూటీ వెంటనే నితిన్ సరసన ' ఛల్ మోహన్ రంగ' సినిమాలో యాక్ట్ చేసింది. ఆమె చేసిన రెండు సినిమాలు ప్లాప్స్ అయ్యాయి.

మరి ఎవరి సరసన..?

దీంతో ఆమె ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్న టైములో ఆమె దృష్టి తమిళ సినిమాలపై పడింది. ఆల్రెడీ అక్కడ సినిమాలు చేసిన అనుభవం ఉండటంతో.. ఈ అమ్మడుకి రజినీకాంత్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినపడుతుంది. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో.. సన్ పిక్చర్స్ బ్యానర్ పై రజినీకాంత్ ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల చివరలో స్టార్ట్ కానుంది. బాబీ సింహ.. విజయ్ సేతుపతిలు ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. మరి వీరిలో మెగా ఆకాష్ ఎవరి సరసన నటిస్తుందో తెలియదు కానీ ఈ సినిమాలో మాత్రం భాగం కానుంది. మరి ఇది ఎంతవరకు తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

Similar News