Chiranjeevi : షూటింగ్ మొదలయింది

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ షూటింగ్ మొదలయింది. ఈ మేరకు సినిమా యూనిట్ మెగా అభిమానులకు అప్ డేట్ ఇచ్చింది. మళయాలంలో సూపర్ హిట్ అయిన [more]

Update: 2021-10-13 06:17 GMT

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ షూటింగ్ మొదలయింది. ఈ మేరకు సినిమా యూనిట్ మెగా అభిమానులకు అప్ డేట్ ఇచ్చింది. మళయాలంలో సూపర్ హిట్ అయిన లూసీఫర్ ను తెలుగులో చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం టైటిల్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్.బి. చౌదరి, ఎన్వీ ప్రసాద్ లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ప్రత్యేకపాత్రలో సల్మాన్…

చిరంజీవి నటించే గాడ్ ఫాదర్ మూవీలో సల్మాన్ ఖాన్ నటిస్తునట్లు టాలీవుడ్ టాక్. ఇక చిరంజీవి కోసం ప్రత్యేకంగా హాలీవుడ పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్ ఒక పాట పాడతారని కూడా అంటున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. మెగా అభిమానులకు ఈ సినిమా అప్ డేట్ పండగ వేళ మురిపించింది.

Tags:    

Similar News