సైరా ట్రైలర్ ఎప్పుడు..ఎక్కడ అంటే

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ చిత్రం సైరా షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. ఫ్రీడమ్ [more]

Update: 2019-07-28 13:45 GMT

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ చిత్రం సైరా షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈమూవీ ను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఇక ఇందులో చిరంజీవి సరసన నయనతార నటిస్తుంది. అలానే కొన్ని ముఖ్య పాత్రల్లో జగపతిబాబు,విజయసేతుపతి,అమితాబ్,తమన్నా వంటి స్టార్స్ నటించారు.

అయితే తాజా ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఈమూవీ థియేట్రికల్ ట్రైలర్ గురించి ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. సైరా చిత్ర ట్రైలర్ ను భారీ లెవెల్ లో, అందరికి అన్ని భాషల్లో జనాలకు రీచ్ అయ్యేవిధంగా ప్లాన్ చేసారు. ఖతార్ లోని దోహా వేదికగా వచ్చే నెల 15 మరియు 16 తేదీలలో జరగనున్న సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేదికపై ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేయనున్నారని సమాచారం. నార్త్ లో హిందీ తో పాటు సౌత్ లో కొన్ని భాషల్లో రిలీజ్ అవుతున్న ఈసినిమా ట్రైలర్ అన్ని భాషల్లో అదే రోజు రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు రామ్ చరణ్. ఇలా చేయడం వల్ల అన్ని భాషల్లో సైరా కు మంచి క్రేజ్ వస్తుంది భావిస్తున్నారు. దీనిపై ఆఫిషల్ న్యూస్ త్వరలోనే రానుంది.

Tags:    

Similar News