chiranjeevi : సాయిపల్లవి నా సినిమాను రిజెక్ట్ చేసింది

లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి సాయిపల్లవిపై సెటైర్లు వేశారు. తన పక్కన నటించేందుకు సాయిపల్లవి ఇష్టపడలేదని, [more]

Update: 2021-09-19 13:59 GMT

లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి సాయిపల్లవిపై సెటైర్లు వేశారు. తన పక్కన నటించేందుకు సాయిపల్లవి ఇష్టపడలేదని, తన సినిమాను రిజెక్ట్ చేసిందని చిరంజీవి అన్నారు. అయితే ఆ సినిమాలో తన పక్కన సోదరి పాత్ర పోషించాలని భావించామని, సాయిపల్లవి ఎందుకు రిజెక్ట్ చేసిందో తనకు తెలియదని చిరంజీవి చెప్పారు. అయితే సాయిపల్లవి డ్యాన్స్ చూసిన తర్వాత సిస్టర్ గా తన పక్కన నటించనందుకు తాను సంతోషపడ్డానని చిరంజీవి అన్నారు. దీంతో సాయిపల్లవి దీనిపై వివరణ ఇచ్చుకున్నారు. తనకు చిరంజీవి అంటే ఎంతో గౌరవమని, అంతే భయమని, తర్వాత సినిమాలో అవకాశమిస్తే ఖచ్చితంగా నటిస్తానని సాయిపల్లవి చెప్పారు.

Tags:    

Similar News