టైటిల్ విషయంలో తికమకపడుతున్నారట

చిరు – కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా టైటిల్ విషయంలో చిరు చేసిన చిన్న తప్పిదంతో…. ఆ టైటిల్ గ్రాండ్ గా కాకుండా చాలా సైలెంట్ [more]

Update: 2020-03-11 05:05 GMT

చిరు – కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా టైటిల్ విషయంలో చిరు చేసిన చిన్న తప్పిదంతో…. ఆ టైటిల్ గ్రాండ్ గా కాకుండా చాలా సైలెంట్ గా బయటికి వచ్చేసింది. కొరటాల – చిరు సినిమా మొదలైనప్పటినుండే ఆచార్య టైటిల్ ప్రచారంలో ఉండడం, చిరు అనుకోకుండా రివీల్ చెయ్యడంతో.. కొరటాల, నిర్మాత రామ్ చరణ్ షాక్ తిన్నారనే న్యూస్ నడిచింది. అయితే ఇక అదే టైటిల్ ని పెడుతున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ తాజాగా మల్లి కొరటాల – రామ్ చరణ్ – చిరు ఆచార్య టైటిల్ విషయంలో ఆలోచనలో ఉన్నట్లుగా లేటెస్ట్ న్యూస్. ఎందుకంటే ఆచార్య అనేది కేవలం చిరు కి మత్రమే సెట్ అవుతుంది.

కానీ ఈ సినిమాలో మరో యంగ్ హీరో(మహేష్ ఆర్ రామ్ చరణ్) కానీ నటిస్తాడనే న్యూస్ ఉంది. ఆ లెక్క ప్రకారం టైటిల్ లో ఇద్దరి పేర్లు ఉండేలా చూడాలని అనుకోవడం, ఆచార్య టైటిల్ కి అనుకున్న రెస్పాన్స్ అయితే రాలేదని.. మెగా ఫ్యాన్స్ మరో పవర్ ఫుల్ టైటిల్ కావాలని పట్టుబడుతున్నారని.. అలాగే మల్టీస్టారర్ అనుకుంటున్నారు కాబట్టి.. ఈ సినిమాకి పవర్ ఫుల్ టైటిల్ అయితే బావుంటుంది అనే ఆలోచనలో కొరటాల – చిరు – చరణ్ ఉన్నారనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. ఎలాగూ ఉగాదికి మెగాస్టార్ చిరు మూవీ లుక్ వదులుదామని టీం డిసైడ్ అయినట్లుగా న్యూస్ ఉంది. ఆ ఉగాది రోజునే టైటిల్ తో పాటుగా ఓ మోషన్ పోస్టర్ ని కూడా వదలాలని టీం సిద్దమవుతుందట. మరి ఉగాది రోజున చిరు సినిమా టైటిల్ ఆచార్య నా లేదా మారేదన్నా అనే దాని మీద క్లారిటీ రావొచ్చని అంటున్నారు.

Tags:    

Similar News