బిగ్ బాస్ స్టేజ్ పై నవ్వులు పూయించిన చిరు

బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ ఫినాలే హైలెట్స్ లో చిరు కామెడీనే బెస్ట్ హైలెట్. ఆదివారం రాత్రి జరిగిన ఫినాలే ఎపిసోడ్ లో చిరంజీవి ముఖ్య [more]

Update: 2019-11-04 04:31 GMT

బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ ఫినాలే హైలెట్స్ లో చిరు కామెడీనే బెస్ట్ హైలెట్. ఆదివారం రాత్రి జరిగిన ఫినాలే ఎపిసోడ్ లో చిరంజీవి ముఖ్య అథితిగా వచ్చి కంటెస్టెంట్స్ ని కామెడీగా ఆటపట్టించారు. అసలు ఎపిసోడ్ లో నాగార్జున స్టేజి మీద ఇచ్చిన స్పీచ్, కంటెస్టెంట్స్ తో మాట్లాడిన మాటలు, హీరోయిన్స్ డాన్స్ పెరఫార్మెన్సెస్, బిగ్ బాస్ ఎలిమినేటెడ్ హౌస్ మేట్స్ హడావిడి ఒక ఎత్తైతే… బిగ్ బాస్ విన్నర్ కి ట్రోఫీని ప్రెజెంట్ చెయ్యడానికి స్పెషల్ గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన స్పీచ్ ఒక ఎత్తు అన్నట్టుగా ఉంది చిరు స్పీచ్, కామెడీ, సిగ్గు, బిడియం అన్ని. నాగార్జున తో కలిసి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజ్ మీద నవ్వులు పూయిస్తూ మెగాస్టార్ చేసిన సందడి అబ్బా… అదుర్స్ అన్న రేంజ్ లో ఉంది

ఈ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే లో నాగ్ హోస్టింగ్ ని పక్కనబెడితే… . చిరంజీవి కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ ఫన్ జనరేట్ చేసారు. ఒక్కొక్కరిని పలకరిస్తూ ముందుగా.. పునర్నవిని గారు అంటూ మిమ్మల్ని గారు అనలేదు అంటూ ఏడిపించడం, వరుణ్ సందేశ్ వితికాలతో మాట్లాడుతో… వితిక మా ఊరమ్మాయి, భీమవరం అమ్మాయి, వరుణ్ సందేశ్ మా ఊరి అల్లుడు అంటూ ఫన్నీగా మట్లాడడం, తర్వాత హిమజాని అప్రిషెట్ చెయ్యడం, రోహిణి చిరు కి ఐ లవ్ యు చెప్పగా… ఆ ఐ లవ్ యు అనే పదం ఈ వయసులో వినడానికి బావుంది అని చిరు సిగ్గు పడడం, రవి తో కామెడీ చెయ్యడం, ఇక జ్యోతి తో తెలంగాణ యాస మట్లాడడం, తమన్నా ని సోదరి అనడం, ఆమె ధైర్యా సాహసాలను పొగడడంతో పాటుగా కాస్త ఎమోషన్ అవడం, అలీ ని నాగార్జున తో పోల్చడం, ఇంకా బాబా భాస్కర్ ని 100 రోజులు బిగ్ బాస్ హౌస్ లో బాగా నటించావంటూ అట పట్టించడం, మీరు మీ కోపాన్ని 100 రోజుల పాటు జయించారని బాబా కి చెప్పడమే కాదు…. టివి 9 జాఫర్ తో మట్లాడాలి అంటే కాస్త భయమంటూ చిరు కామెడీ చెయ్యడం ఈ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కె హైలెట్ అనేలా ఉంది. ఇక చివరిగా చిరంజీవి… శ్రీముఖి, రాహుల్ లలో ఒకరిని ఫినాలే విన్నర్ గా ప్రకటించేటప్పుడు చాలా చాకచక్యంగా రాహుల్ ని విన్నర్ గాఎనౌన్స్ చెయ్యడం వరకు చిరు వన్ మ్యాన్ షోలా జరిగింది.

Tags:    

Similar News