2019 లో మెగా ఫ్యాన్స్ కు నిరాశే..!

Update: 2018-12-01 06:13 GMT

దాదాపు దశాబ్దం పాటు సినిమాలకి దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150 ' తో రీఎంట్రీ ఇచ్చి తన అభిమానుల్లో మునుపటి ఉత్తేజాన్ని నింపారు. ఆ తరువాత వెంటనే లేట్ చేయకుండా 'సైరా' ను స్టార్ట్ చేశాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు పెంచుకున్నారు మెగా అభిమానులు. మొదట ఈ సినిమాను వచ్చే ఏడాది 2019 సమ్మర్ లో రిలీజ్ అనుకున్నారు. కానీ అప్పుడు వచ్చే సూచనలు కనిపించడం లేదు. 2019 దసరాకు వచ్చే అవకాశముందని తెలుస్తుంది.

2020 సంక్రాంతికేనా..?

అయితే నిర్మాత రామ్ చరణ్ మాత్రం బడ్జెట్ ను పెంచుకుంటూ పోతున్నాడని.. ఎక్కడా కంప్రమైజ్ కాకుండా తీయాలని... రిలీజ్ డేట్ విషయం పట్టించుకోకుండా పని చేయాలని డైరెక్టర్ కి చెప్పాడట. దాంతో ఈ సినిమాకు డెడ్ లైన్ ఏమీ పెట్టకుండా కావాల్సినంత సమయం తీసుకొమ్మని దర్శకుడు సురేందర్ రెడ్డికి చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో ఈ సినిమా 2019 దసరాకి కూడా కాదు 2020 సంక్రాంతి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

మెగా ఫ్యాన్స్ కి నిరాశే...

మరోపక్క రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో #RRR లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా అదే ఏడాది అంటే 2020 సమ్మర్ లో వస్తుందని ముందుగానే అనౌన్స్ చేసారు. కాబట్టి 2019లో మెగా ఫ్యాన్స్ కు రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ' తప్ప ఇంకో సినిమా లేదన్న మాట మరింత నిరాశకు గురి చేస్తోంది. అల్లు అర్జున్ ఇంకా తన నెక్స్ట్ సినిమాను కంఫర్మ్ చేయలేదు.

Similar News