మెగా ఫాన్స్ కూడా నాగబాబుదే తప్పంటున్నారు..!

బాలకృష్ణ మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న నాగబాబు… మొన్నామధ్యన బాలకృష్ణ తనకు ఎవరో తెలియదని చెప్పడు. అలాగే రెండు రోజుల క్రితం మరోసారి బాలకృష్ణని టార్గెట్ చేస్తూ [more]

Update: 2019-01-05 08:22 GMT

బాలకృష్ణ మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న నాగబాబు… మొన్నామధ్యన బాలకృష్ణ తనకు ఎవరో తెలియదని చెప్పడు. అలాగే రెండు రోజుల క్రితం మరోసారి బాలకృష్ణని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు నాగబాబు. దానితో బాలకృష్ణ ఫాన్స్ నాగబాబు మీద ఫైర్ అవుతున్నారు. నిన్న సోషల్ మీడియాలో నాగబాబు పోస్ట్ చేసిన పోస్ట్ క్షణాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. క‌ట్టుక‌థ‌లు కొన్ని.. క‌ల్ప‌న‌లు ఇంకొన్ని.. చుట్ట‌నేల మూట గ‌ట్ట‌నేల‌.. నిజం క‌క్క‌లేని బ‌యోపిక్ లు వద్ద‌మ్మా విశ్వదాభిరామ‌.. విన‌రా మామా అంటూ బాలకృష్ణని సెటైరికల్ గా రెచ్చగొట్టాడు. ఇక అది చూసిన బాలయ్య ఫ్యాన్స్ ఇది కచ్చితంగా బాల‌య్య‌ని టార్గెట్ చేస్తూ చేసిందే అంటూ నాగబాబుపై మండిపడుతున్నారు.

బాలయ్యనే ఎందుకు టార్గెట్..?

ఇక కొంతమంది సినిమా పెద్దలు కూడా నాగబాబు – బాలకృష్ణల మధ్యన జరిగే వార్ కి ఫుల్ స్టాప్ పెడితే బాగుండుననే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు కేవలం సోషల్ మీడియాలో మాత్రమే కనిపించిన నందమూరి – మెగా అభిమానుల వార్ ఇప్పుడు ఛానల్స్ ప్రసారం చేస్తున్న డిబేట్స్ లోకి ఎక్కాయి. బాలయ్య వీరాభిమానులతో పాటుగా మెగాభిమానులు కూడా ఛానల్స్ కెక్కి రచ్చ మొదలెట్టారు. అయితే ఇదంతా చూస్తున్న మెగా ఫ్యాన్స్ కూడా నాగబాబు ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం సరికాదనడం గమనార్హం. నాగబాబు జనసేనలోకి వెళ్లడానికే బాలయ్యని టార్గెట్ చేస్తూ పవన్ మెప్పు పొందడానికి ట్రై చేస్తున్నట్లుగా మెగా ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. మరి మెగా ఫ్యాన్స్ కూడా నాగబాబు ఇక నుండి ఇలాంటివి చెయ్యకుండా ఉంటే బాగుంటుందని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Tags:    

Similar News