కొరటాల డెసిషన్ కి మెగా ఫాన్స్ షాక్..!

Update: 2018-08-31 08:56 GMT

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 'సైరా' సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా చిరంజీవి పుట్టిన రోజున రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. ఈ సినిమా తర్వాత చిరు కొరటాల డైరెక్షన్ లో 152వ సినిమా చేస్తున్నాడు. కొరటాల.. చిరు కోసం ఓ పవర్ ఫుల్ స్టోరీని రెడీ చేశాడు. ఇందులో చిరంజీవి డబుల్ యాక్షన్ లో నటించనున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది మొదటి నెలలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

తమన్నా వద్దు బాబోయ్...

అయితే కొరటాల తీసుకున్న నిర్ణయంపై చిరు ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవికి జోడిగా ఇందులో నిత్యామీనన్, తమన్నా నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం తమన్నాకు ఐరెన్ లెగ్ గా ముద్ర పడిపోయింది. ఆమె ఏ సినిమా చేసినా డిజాస్టర్ అయ్యాయి. దీనికి తోడు చిరు పక్కన తమన్నా ఫేడ్ ఔట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రేక్షకులు కూడా తమన్నా ఎంపిక విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమన్నా ప్లేస్ లో మరో హీరోయిన్ లేదా అనుష్క అయినా.. మరెవరైనా బాలీవుడ్ హీరోయిన్ ని అయినా ఎంపిక చేయాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సరైన జోడీ అని భావిస్తోన్న కొరటాల

అయితే కొరటాల మాత్రం తమన్నా చిరుకి పర్ఫెక్ట్ జోడి అని.. డాన్సులపరంగా కూడా చిరంజీవికి దీటుగా చేస్తుందని..గ్లామర్ పరంగా తమన్నా సినిమాకు హైలైట్ అవుతుందని భావించి ఆమెను ఎంపిక చేసాడంట. మరి ఇప్పుడు ఆ నిర్ణయం కొరటాల వెనక్కి తీసుకుని ఫ్యాన్స్ కోరిక మేరకు వేరే హీరోయిన్ ని ఇందులోకి తీసుకుంటాడేమో చూడాలి.

Similar News