రాజమౌళికి చుక్కలు చూపిస్తున్న మెగా ఫ్యాన్స్?

రాజమౌళికి మెగా ఫ్యాన్స్ చుక్కలు చూపించడం ఏమిటి? చూపిస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్, చరణ్ ఫ్యాన్స్ కలిపి చూపించాలిగా అనుకుంటున్నారేమో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం కూల్ గానే ఉన్నారు. [more]

Update: 2020-02-20 07:17 GMT

రాజమౌళికి మెగా ఫ్యాన్స్ చుక్కలు చూపించడం ఏమిటి? చూపిస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్, చరణ్ ఫ్యాన్స్ కలిపి చూపించాలిగా అనుకుంటున్నారేమో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం కూల్ గానే ఉన్నారు. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం రాజమౌళి ని వదిలేలా కనిపించడం లేదు. కారణం సినిమా ఫస్ట్ లుక్ విషయం కాదు కానీ.. ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర తాలూకు లుక్ తో పాటు ఓ వీడియో కూడా లీకై సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఎన్టీఆర్ కొమరం భీం లుక్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ అంచనాకి వచ్చేసారు. కానీ అల్లూరి సీతారామరాజు చరణ్ లుక్ విషయం ఇంకా ఎటూ తెగలేదు.

అందుకే రాజమౌళిని మెగా ఫ్యాన్స్ వేపుకు తింటున్నారట. రామ్ చరణ్ అల్లూరి లుక్ ఎలా ఉంటుంది? ఎన్టీఆర్ కి ఉన్నట్టే చరణ్ కి కూడా హీరోయిజం సీన్స్ ఉంటాయా? అసలు బయట అల్లూరి మీసకట్టుతో తప్ప చరణ్ మామూలుగానే కనబడుతున్నాడు. సినిమా కోసం చరణ్ ఎలా మారుతున్నాడు? అందులోను చిరు కూడా ఈమధ్యనచరణ్ పాత్ర విషయంపై రాజమౌళి మీద అలిగాడనే న్యూస్ ఉంది. మరి ఇంత జరుగుతున్నా రాజమౌళి మాత్రం ఎలాంటి స్పందన లేకుండా ఉన్నాడు.. మాకు చరణ్ లుక్ కొద్దో గొప్పో లీక్ చేయొచ్చుగా అంటూ రాజమౌళి పై మెగా ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారట.

Tags:    

Similar News