అదిరెను ఈ మెగా ఫ్యామిలీ పిక్..!

Update: 2018-09-21 06:45 GMT

బోయపాటి శ్రీను - రామ్ చరణ్ లు RC12 సినిమా షూటింగ్ ని చకచకా కానిచ్చేస్తున్నారు. ప్రస్తుతం అజర్ భైజాన్ అనే అరుదైన లొకేషన్ లో ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక అజర్ భైజాన్ షూటింగ్ స్పాట్ లో తెరకెక్కించే యాక్షన్ సీక్వెన్సెస్ RC12 కే పవర్ ఫుల్ అని, ఇవి కీలక సన్నివేశాలుగా ఎప్పటినుండో చెబుతున్నారు. అయితే అక్కడ అజర్ భైజాన్ లొకేషన్స్ లో రామ్ చరణ్ తో పాటుగా ఆయన భార్య ఉపాసన కూడా సందడి చేస్తుంది. అక్కడి షాపింగ్ విశేషాలతో పాటుగా రామ్ చరణ్ చేసే జిమ్ తో పాటు ఆ లొకేషన్స్ ని ఎంజాయ్ చేస్తూ తాము దిగిన ఫొటోస్ ని ఉపాసన ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మెగా అభిమానులను ఉత్సాహపరుస్తుంది.

సోషల్ మీడియాతో పెట్టిన ఉపాసన

ఇకపోతే రామ్ చరణ్ సినిమాలకు ఆయన తండ్రి చిరు సినిమాలకు చిరు పెద్ద కూతురు సుష్మితనే కాస్ట్యూమ్ డిజైనర్. అయితే రామ్ చరణ్ షూటింగ్ స్పాట్ తో పాటుగా చిరు సైరా సినిమా షూటింగ్ స్పాట్ లోనూ సుస్మిత ఉండాల్సి వస్తుంది. ప్రస్తుతం చరణ్ RC 12 షూటింగ్ స్పాట్ లోనే సుస్మిత స్పెండ్ చేస్తుంది. ఇక తాజాగా నిన్న చిరంజీవి కూడా అజర్ భైజాన్ షూటింగ్ స్పాట్ కి వచ్చి అందరికీ షాకిచ్చాడు. కొడుకు షూటింగ్ కు హాజరైన చిరంజీవి ఆక్కడి షూటింగ్ లొకేషన్ లో సందడి చెయ్యడమే కాదు.. కొడుకు రామ్ చరణ్, కోడలు ఉపాసన, కూతురు సుష్మిత, అల్లుడితో పాటు డిన్నర్ డేట్ లో మెరిశాడు. అప్పుడు దిగిన ఫోటోని ఉపసన సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం... అది రామ్ చరణ్ షేర్ చేయడం.. అబ్బో ఆ టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రేండింగ్ లోకొచ్చేసింది.

Similar News