మెగా ఫ్యామిలీ దెయ్యాల పార్టీ అదిరిందిగా..!

Update: 2018-10-27 07:36 GMT

ఒకప్పుడు అమెరికా వంటి దేశాల్లో హాలోవీన్ పార్టీ కల్చర్ కనబడేది. కానీ ఆ పార్టీ కల్చర్ ఇప్పుడు ఇండియాలోనూ నడుస్తోంది. బాలీవుడ్ సెలబ్రిటీస్ ఎప్పటి నుండో హాలోవీన్ పార్టీ లకు అలవాటు పడ్డారు. అసలు చాలామందికి ఈ హాలోవీన్ పార్టీ కల్చర్ అంటే ఏమిటో తెలియదు. హాలోవీన్ పార్టీ అంటే... రకరకాల దెయ్యాల బట్టలు వేసుకుని వికృతంగా రెడీ అవడమే. మొహం మీద రక్తం కారుతున్నట్టు... జుట్టు విరబోసుకుని.. నల్లని దుస్తుల్లో కనిపిస్తూ అల్ల్లరి చెయ్యడమే ఈ హాలోవీన్ పార్టీ అనేది. ఇక ఇప్పుడు ఇక్కడ తెలుగు వారు కూడా ఈ కల్చర్ ని ఒంట బట్టించుకున్నారు.

చిరు ఫ్యామిలీ కూడా...

గత నాలుగైదేళ్లుగా పేజీ త్రీ గర్ల్స్ ఇలా హాలోవీన్ పార్టీ కల్చర్ ని తెలుగు వాళ్లకి పరిచయం చేశారు. టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ఇప్పుడు ఈ హాలోవీన్ పార్టీ కల్చర్ కి అలవాటు పడ్డారు. గత ఏడాది మంచు లక్ష్మి, నారా బ్రాహ్మణి, ఉపాసన, నమ్రత వంటి వారు ఈ హాలోవీన్ పార్టీ లో హడావుడీ చేస్తే ఈ ఏడాది మెగా ఫ్యామిలీ ఈ హాలోవీన్ పార్టీతో హడావుడి చేసింది. చిరు ఫ్యామిలిలో ఉన్న చిన్న పెద్ద అంతా ఈ హాలోవీన్ గెటప్స్ తో అదరగొట్టారు. చిరంజీవి దగ్గర నుండి అల్లు అర్జున్ కూతురు అర్హ, ఆయాన్ వరకు అందరూ హాలోవీన్ పార్టీ లో సందడి చేశారు.

చిన్నాపెద్దా అంతా కలిసి...

ఉపాసన పోస్ట్ చేసిన ఫొటోస్ లో రామ్ చరణ్ తప్ప మొత్తమంతా అంటే చిరు,అల్లు అర్జున్, శ్రీజ, సుష్మిత, కళ్యాణ్ దేవ్, నిహారిక, అల్లు అయాన్, అల్లు అర్హ, ఉపాసన, స్నేహ, సాయి ధరమ్ తేజ్, చిరు అక్కయ్యలు అంతా ఈ హాలోవీన్ పార్టీ లో హడావిడి చేశారన్న విషయం పైన చూస్తున్న ఫొటోతో అర్ధమవుతుంది. మరి చిరంజీవి కూడా ఈ హాలోవీన్ పార్టీ లో భయంకరమైన మేకప్ తో ఉన్నాడు. అలాగే మిగతా వాళ్ళు కూడా లానే ఉన్నారు. మరి ఈ మెగా పిక్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.

Similar News