కాజల్ కి చుక్కలు చూపించిన మీడియా..!

Update: 2018-12-04 08:48 GMT

అదేమిటి మీడియా కాజల్ కి చుక్కలు చూపెట్టడం అనుకుంటున్నారా ? కాజల్ కవచం ప్రమోషన్స్ లో బిజీగా ఉండి మీడియాతో బాగా ఇంటరాక్ట్ అవుతుంది. నిన్నగాక మొన్న కవచం ఆడియో వేడుకలో పాల్గొన్న కాజల్ అగర్వాల్ తాజాగా ఇంటర్వూస్ లో పాల్గొంటుంది. అయితే అందరి మాదిరిగా అంటే స్టార్ హీరోలు ఏదైనా తమ సినిమా ఆడియో వేడుక, సక్సెస్ మీట్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరిగినప్పుడు... సమయానికి రాకుండా ఆ వేడుక చివర్లో వచ్చి స్టేజ్ మీదకెక్కి నాలుగు ముక్కలు చెప్పేసి వెళ్లిపోతుంటారు. అయితే అక్కడ సినిమాకి సంబందించిన ఇతరత్రా సభ్యులు ఉండి ఆ ఈవెంట్ ని మేనేజ్ చేస్తారు. కానీ కొంతమంది స్టార్స్ ప్రెస్ మీట్ కి, స్పెషల్ గా మీడియా ఇంటర్వూస్ కి కూడా బాగా లేట్ వస్తుంటారు.

రెండు గంటలు ఆలస్యంగా...

తాజాగా కాజల్ కూడా అలానే మీడియాని రెండు గంటలకు పైగా వెయిట్ చేయించింది. కవచం ప్రమోషన్స్ లో భాగంగా కాజల్ అగర్వాల్ మీడియాకి సోలో ఇంటర్వూస్ ఇస్తుంది. అయితే ప్రెస్ ని 10 గంట‌ల‌కు కాజల్ ఇంటర్వ్యూ కోసం ప్రసాద్ ల్యాబ్ కి పిలిచాడు కవచం పీఆర్వో. మీడియా చెప్పిన టైంకి ప్రసాద్ ల్యాబ్ కి వచ్చేసింది. కానీ కాజల్ మాత్రం తీరిగ్గా 11.45 గంటల‌కు వచ్చింది. ఇక రెండు గంటల పాటు కాజల్ కోసం వెయిట్ చేసిన మీడియా... కాజల్ కారు దిగి రాగానే బాయ్ కాట్‌ చెప్పేసి వెళ్లిపోయారు. ఇక మీడియా అలా బాయ్ కాట్‌ చెప్పగానే కాజల్ ఒకింత షాక్ అయ్యిందట. మరి కాజల్ మళ్లీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్షమాపణ చెప్పకపోతే ఆమెకు మీడియా చుక్కలు చూపించడం ఖాయంగానే కనబడుతుంది.

Similar News