చివరికి జబర్దస్త్ ని నమ్ముకున్న బిగ్ బాస్?

బుల్లితెర ప్రేక్షకులు మూడు నెలలు సరైన ఎంటర్టైన్మెంట్ లేక ఉస్సురుమన్నారు. మూడు నెలలుగా షూటింగ్స్ లేక కొత్త షోస్ కానీ, సీరియల్స్ కానీ లేక నీరసంగా ఉన్న [more]

Update: 2020-09-09 09:55 GMT

బుల్లితెర ప్రేక్షకులు మూడు నెలలు సరైన ఎంటర్టైన్మెంట్ లేక ఉస్సురుమన్నారు. మూడు నెలలుగా షూటింగ్స్ లేక కొత్త షోస్ కానీ, సీరియల్స్ కానీ లేక నీరసంగా ఉన్న బుల్లితెర ప్రేక్షకులకి స్టార్ మా బిగ్ బాస్ 4 బిగ్ రిలీఫ్ ఇస్తుంది అని ఎదురు చూసారు. నాగ్ హోస్ట్ గా గత ఆదివారం మొదలైన బిగ్ బాస్ 4 చాలా చప్పగా కనిపిస్తుంది. చాలామంది తెలియని మొహాలు హౌస్ లోకి అడుగుపెట్టడం, వాళ్ళు కూడా ఎంటెర్టైనెర్స్ కాకపోవడంతో బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ 4 చూస్తేనే పిచ్చెక్కుతుంది. ఊరు పేరు లేని వారితో బిగ్ బాస్ 4 ని తయారు చేసారని బిగ్ బాస్ యాజమాన్యంపై బుల్లితెర ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోయెల్, లాస్య తప్ప పెద్దగా ఎవరు ఎవరికీ పరిచయం లేని వారే. ఇక హౌస్ లో వాళ్లే కాస్త ఆక్టివ్ గా కనబడుతున్నారు.

అయితే షో మీద జనాల్లో ఇంట్రెస్ట్ కలగడానికి బిగ్ బాస్ స్వయంగా వాళ్ళ మధ్యలో అగ్గి రాజేసాడు. ఇద్దరు కంటెస్టెంట్స్ ని మొదటి రోజు నుండి సీక్రెట్ గా దాచి.. గత రాత్రి వాళ్ళని హౌస్ లోకి పంపుతూ హౌస్ మేట్స్ మీకు నిన్న ఫుడ్ పంపలేదు వెళ్లి తేల్చుకోండి అనగానే ఆ ఇద్దరు హౌస్ లోకి వెళ్లి మిగతా 14 మంది కంటెస్టెంట్స్ గొడవ పడడం బిగ్ బాస్ ప్లాన్. మరి బిగ్ బాస్ మీద క్రేజ్ తేవాలంటే ఇలాంటిది ఏదో ఒక గలాటా ఉండాలని బిగ్ బాస్ ప్లాన్ చెయ్యడం పరమ చెత్త. అందుకే బిగ్ బాస్ లో ఇప్పుడు సాలిడ్ కామెడీ ఎంటెర్టైనెర్ కావాలి అందుకే అర్జెంటు గా వైల్డ్ కార్డు ఎంట్రీ ని దింపబోతున్నారట. ప్రస్తుతం 16 మంది కంటెస్టెంట్స్ ఉంటే.. ఇప్పుడు తాజాగా జబర్దస్త్ కమెడియన్ అవినాష్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నాడట.

ఇప్పటికే వారం రోజులుగా క్వారనిటైన్ లో ఉన్న కమెడియన్ అవినాష్ త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 4 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని టాక్. జబర్దస్ కమెడియన్ అయినా బిగ్ బాస్ హౌస్ లో ఫన్ కురిపిస్తాడో లేదంటే అవినాష్ కూడా బిగ్ బాస్ ఆట ఆడతాడో చూడాలి.

Tags:    

Similar News