మారుతి – సాయి ధ‌ర‌మ్ తేజ్ సినిమాకు ఆల్ సెట్

సాయి ధరమ్ తేజ్ కి ఇప్పుడు ఏమాత్రం కలిసి రావడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న చిత్రలహరి కూడా యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. ఆరు ఫ్లాప్స్ తర్వాత [more]

Update: 2019-05-11 07:52 GMT

సాయి ధరమ్ తేజ్ కి ఇప్పుడు ఏమాత్రం కలిసి రావడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న చిత్రలహరి కూడా యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. ఆరు ఫ్లాప్స్ తర్వాత వచ్చిన చిత్రలహరి యావరేజ్ ఇచ్చినందుకు సంతోష పడాలో… ఆ సినిమా యావరేజ్ దగ్గరే ఆగిపోయిందని బాధపడాలో తెలియని పరిస్థితి సాయి తేజ్ కి. ఇక మారుతి కూడా మహానుభావుడు హిట్ అయినా.. శైలజా రెడ్డి అల్లుడు ఫ్లాప్ అవడంతో ఆయ‌న‌తో సినిమాలు చేసేందుకు మరో హీరో ఎవరూ ముందుకు రావడం లేదు. అలాంటి టైంలో సాయి తేజ్ తో మారుతి తన నెక్స్ట్ సినిమాని పట్టాలెక్కించబోతున్నాడు. ఎప్పటినుండో ప్రచారంలో ఉన్నప్పటికీ చిత్రలహరి ఫలితం తర్వాత సాయి తేజ్ మారుతి సినిమా అనౌన్స్ చెయ్యాలనుకున్నాడు. తాజాగా మారుతీ – సాయి తేజ్ కాంబినేషన్ పట్టాలెక్కించడానికి అన్ని రెడీ అయినట్లు సమాచారం.

తండ్రి పాత్ర‌లో రావు ర‌మేశ్‌

ఇప్ప‌టికే సాయి తేజ్ కి హీరోయిన్ ని ఫుల్ స్క్రిప్ట్ ని కూడా చేతిలో పట్టుకుని మారుతి రెడీగా ఉన్నాడు. ఈ సినిమాని డైరెక్టర్ మారుతి ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్నాడు. అయితే ఈ సినిమాలో సాయి తేజ్ కి తండ్రిగా రావు రమేష్ నటించబోతున్నాడట. మరి మిడిల్ క్లాస్ తండ్రి క్యారెక్టర్ అయినా… రిచ్ ఫాదర్ క్యారెక్టర్ అయినా.. రావు రమేష్ ఆ పాత్రకి 100 శాతం న్యాయం చేయగలడని మజిలీ లాంటి సినిమాలో చూసాం. మరి మారుతి – సాయి తేజ్ కాంబోలో రావు రమేష్ ఫాదర్ క్యారెక్టర్ అంటే సినిమాకి మంచి నటీనటులను ఎంపిక చేయ‌డంతోనే సినిమా సగం హిట్ అయినట్లే. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా పూజ కార్యక్రమాలు త్వరలోనే జరగనున్నాయని సమాచారం.

Tags:    

Similar News