మహేశ్ ని అలా అనలేదు బాబోయ్..!

Update: 2018-09-15 08:25 GMT

నిన్న సోషల్, వెబ్ మీడియాలో ఒక న్యూస్ ట్రేండింగ్ లో ఉంది. అది సూపర్ స్టార్ మహేశ్ బాబుని మనోజ్ అనే ఓ కోలీవుడ్ కమెడియన్ యాక్టింగ్ రాదంటూ చేసిన వ్యాఖ్యలు టాప్ ట్రెండింగ్ లోకి వచ్చాయి. మనోజ్ చేసిన వెకిలి చేష్టలకి మహేష్ అభిమానులు మనోజ్ ని తెగ ట్రోల్ చేస్తున్నారు. కేవలం మహేష్ అభిమానులే కాదు.. తెలుగు ప్రేక్షకులు కూడా మనోజ్ చేసిన ఈ వెకిలి వ్యాఖ్యలకు మనోజ్ దొరికితే తన్నేలా విరుచుకుపడుతున్నారు. మరి కేవలం టాలీవుడ్ లోనే కాదు.. ఇండియావ్యాప్తంగా మంచి క్రేజున్న మహేష్ ని ఒక కమెడియన్ ఇలా అనడం ఎవరు తట్టుకుంటారు చెప్పండి. అయితే నెటిజెన్ల, మహేశ్ ఫాన్స్ తిట్ల దండకానికి మనోజ్ ప్రభాకర్ దిగి రాక తప్పలేదు. మహేశ్ మీద తాను చేసిన వ్యాఖ్యలకు సారి చెప్పడమే కాదు.. వివరణ కూడా ఇచ్చుకున్నాడు.

కావాలని చేయలేదు... క్షమించండి..!

ఇంతకీ మనోజ్ ప్రభాకర్ ఎలా సారి చెప్పాడంటే.. సోషల్ మీడియా సాక్షిగా.. తెలుగు సినిమా ప్రియులకు, మహేశ్ అభిమానులకు, మ‌హేశ్‌బాబు కి కూడా,… ఇంతకు ముందు చెప్పినట్టు వ్యక్తిగతంగా నేను మహేశ్ మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ విషయంలో నేను ఎవరినైనా బాధిస్తే.. ఎవరి మనోభావాలను బాధపెట్టి ఉంటే... క్షమించండి. నేను ఇలా కావాలని చెయ్యలేదు. సిన్సియ‌ర్‌గా సారీ చెబుతున్నా. ఇక్కడితో అంతా సద్దుమణుగుతుందని ఆశిస్తున్నా.. అంటూ సోషల్ మీడియా సాక్షిగా మహేశ్ ని, మహేశ్ అభిమానులను మనోజ్ ప్రభాకర్ వేడుకున్నాడు.

Similar News