మనోజ్ - కౌశల్ ఆర్మీ మధ్య ఘాటైన విమర్శలు..!

Update: 2018-09-28 08:26 GMT

బిగ్ బాస్ సీజన్ 2పై వచ్చిన విమర్శలు అన్నీఇన్నీ కాదు. ముఖ్యంగా కౌశల్ ఫ్యాన్స్ కౌశల్ ఆర్మీ పేరుతో సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. అది చాలదు అన్నట్టు హోస్ట్ నాని పై విరుచుకుపడుతున్నారు. నాని కౌశల్ ని టార్గెట్ చేసి చాలా ఎక్కువ చేస్తున్నాడని.. తనీష్ ని బాగా సప్పోర్ట్ చేస్తున్నాడని ఇలా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. అంతేకాదు నిన్న రిలీజ్ అయిన 'దేవదాస్' చిత్రాన్ని చూడొద్దని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారట.

మనోజ్ ట్వీట్ చేయడంతో...

ఇది ఇలా ఉండగా..హీరో మంచు మనోజ్ ఈ సినిమాను చూసి ట్వీట్ చేసాడు. "దేవ్ అండ్ దాస్ థ్రిల్లింగ్ కాంబో! ఈ ఇద్దరినీ ఒకే స్క్రీన్ మీద చూడటం ఆనందంగా ఉంది. రోజు రోజుకు యంగ్ గా మారుతున్న నాగార్జున గారికి.. నాని బాబాయ్ కి .. 'దేవదాస్' టీమ్ అందరికీ బెస్ట్ విషెస్" అని చెబుతూ టీంకు శుభాకాంక్షలు తెలిపాడు. మరి ఇందులో ఏమి నెగటివ్ కనిపించిందో ఏంటో వెంటనే కౌశల్ ఫ్యాన్స్ రీట్వీట్ చేస్తూ మండిపడ్డారు. అందులో ఒకరు "ఏం థ్రిల్లింగ్ భయ్యా... మీరు ఈ కామెంట్స్ చేసి మా కౌశల్ అభిమానులను హర్ట్ చేశారు" అన్నారు.

అందరినీ ప్రేమిద్దాం...

దానికి మనోజ్ రిప్లయ్ ఇస్తూ... ''సినిమా అంటే ఒక్కరిది కాదు తమ్ముడు..ఎన్నో రాత్రులు నిద్ర, తిండి మానేసి..ఫ్యామిలీస్ ని వదిలేసి కష్టపడుతుంటారు. ఒక్క సినిమా ఎంతో మంది ఆకలి తీరుస్తుంది. ఆ నెగటివ్ థాట్స్ అన్నీ వదిలేయండి. అందమైన తెలుగు సినిమా చూసి ఎంజాయ్ చేయండి. అందరినీ ప్రేమిద్దాం.. గౌరవిద్దాం" అని రిప్లయ్ ఇచ్చాడు. ఆ కామెంట్ కింద ఇంకోరు.."మనోజ్ గారు మాకు కూడా ఊరికినే డబ్బులు రావండి. మేము కూడా ఎంతో కష్టపడితేనే మీ అందరి సినిమాలు చూడగలం. ఒకరి కష్టం గురించి ఆలోచించే వ్యక్తి వేరే వాళ్లని చులకనగా మాట్లాడరు. నాని గౌరవం కోల్పోయాడు" అని కామెంట్ పెట్టాడు.

నాని తప్పు చేస్తున్నందున...

దాని కింద ఇంకో కౌశల్ ఫ్యాన్ "మనోజ్ భయ్యా మీరు అనవసరంగా ఇందులోకి దూరొద్దు.. ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. తారక్ అన్న ఫ్రెండ్ గా మీపై మాకు గౌరవం ఉంది. దాన్ని పోగొట్టుకోకు అన్న. బిగ్ బాస్ లో నాని అన్న చేస్తుంది తప్పు దానికి అతను అనుభవించాలి. కౌశల్ ఆర్మీ లైట్ తీసుకుంటే అనుభవిస్తారు" అని కొంచం ఘాటుగానే కామెంట్ చేసాడు. అదేవిధంగా కౌశల్ ఆర్మీకి కౌంటర్ ఇచ్చేవారు కూడా ఉన్నారు. మరో రెండు రోజుల్లో ఫైనల్ ఉంది. అందులో ఎవరు విన్నరో తెలిసిపోనుంది. సో వెయిట్ అండ్ సీ.

Similar News