హీరోలకు అలా... మాకు ఇలానా?

Update: 2018-06-29 10:56 GMT

ఏ ఇండస్ట్రీలో అయినా హీరోయిన్ కి పెళ్ళై పిలల్లు పుట్టారంటే చాలు వాళ్లకి అమ్మ, అక్క, వదిన పాత్రలే వస్తాయి. అందులోనూ హీరోయిన్స్ ఎలాగూ 35 దాటందే పెళ్లిళ్లు చేసుకోరు. ఇక పెళ్ళై 40 ఏళ్లకు పిల్లలు పుడితే వాళ్ల అందంలో తరుగుదల స్పష్టంగా కనబడుతుంది. పిల్లలు పుట్టే వరకు ఫిట్ గా ఉండేవారు.. పిల్లలు పుట్టగానే తేడా వచ్చేస్తారు. అందుకే వారికీ మళ్లీ హీరోయిన్ అవకాశాలు రావు. ఈ కారణంగానే కొంతమంది హీరోయిన్స్ పెళ్లి మాటెత్తరు. ఇక హీరోలైతే సకాలంలో పెళ్లిళ్లు చేసుకుని పిల్లలని కన్నాక కూడా.. ఆ పిల్లలకి పెళ్లీడు వచ్చినప్పటికీ.. ఇంకా హీరోలుగా కొనసాగుతారు. వారి పిల్లలు హీరోలైనా, పెళ్ళై పిల్లల్ని కన్నప్పటికీ ఇంకా వారు హీరోయిజాన్ని చూపించడానికే ఇష్టపడతారు.

మాకే ఎందుకిలా జరుగుతోంది..

బాలీవుడ్ లో అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ ల కూతుళ్లు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తున్నప్పటికీ ఇంకా వారు స్టార్ హీరోలుగా ఉన్నారు. అయితే అలా ఎందుకు జరుగుతుంది అని ఒక బాలీవుడ్ మాజీ హీరోయిన్ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఒకప్పుడు షారుఖ్, సల్మాన్ లతో జంటగా హీరోయిన్ గా మెప్పించిన మనీషా కొయిరాలా ప్రస్తుతం తల్లి పాత్రలు చేస్తుంది. బాలీవుడ్ లో సంజయ్ దత్ బయోపిక్ సంజు లో రణబీర్ కి తల్లి పాత్ర చేసింది మనిషా కొయిరాలా. ఆ సినిమా ఈ రోజే విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు మనీషా తనకి తల్లి పాత్రలే వస్తున్నాయని టెంక్షన్ పడుతుంది. అందుకే ఆమె మాలో కొందరు పెళ్లిళ్లు చేసుకుని కొన్నాళ్ళు ఇండస్ట్రీకి దూరమై మళ్ళీ రి ఎంట్రీ ఇస్తే వారికి తల్లి పాత్రలే దక్కుతున్నాయి. కానీ మాతో పాటె ఇండస్ట్రీలో ఉన్న హీరోలు మాత్రం ఇప్పటికి 20 ఏళ్ల హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నారు. కానీ మా హీరోయిన్స్ కే ఎందుకిలా జరుగుతుందో అర్ధం కావడం లేదు... అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఇక సంజు సినిమాలో రణబీర్ కపూర్ కి అంటే సంజయ్ దత్ తల్లిగా మనిషా నటన సూపర్ అనే టాక్ వస్తోంది.

Similar News