మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ త్వరలోనే

Update: 2018-12-09 11:19 GMT

రాజమౌళి తీసిన 'బాహుబలి' చిత్రం భారతీయ సినీమా మార్కెట్ విశ్వవ్యాప్తమైన విషయం తెలిసిందే. మార్కెట్ కూడా ఓపెన్ అయిపోవడంతో అందరూ పెద్ద బడ్జెట్స్ మీద పడుతున్నారు. అవసరం ఉన్న లేకపోయినా సినిమాకి బడ్జెట్ పెంచేయడం కామన్ అయిపోయింది. కానీ ఎప్పటినుండో మణిరత్నం భారీ బడ్జెట్ తో తన డ్రీం ప్రాజెక్ట్ ను తీయాలని ప్లాన్ చేస్తున్నాడు.

కల్కీ కృష్ణ మూర్తి రాసిన ఫేమస్ హిస్టారికల్ నవల 'పొన్నీయిన్ సెల్వన్'. ఈ నవలని కథ మార్చి తెర పైకి తీసుకురావాలన్న మణిరత్నం కల. ఎన్నిసార్లు ప్రయత్నించినా అది సాధ్యం కావడం లేదు. బడ్జెట్ ఎక్కువగా ఉండటంతో ఈసినిమాను ప్రొడ్యూస్ చేయడానికి ప్రొడ్యూసర్స్ ఎవరు ముందుకు రావడంలేదు. చేసేది ఏమి లేక మణిరత్నం తన సొంత బ్యానర్ మద్రాస్ టాకీస్ లో ఈచిత్రాన్ని నిర్మిద్దాం అనుకున్నాడు కానీ అది కూడా వర్క్ అవుట్ అవ్వలేదు. మణిరత్నం ని నమ్మి ఫైనాన్షియర్ లు ఎవరు అంత ఖర్చుచేయడానికి జంకడంతో ఆ ప్రాజెక్ట్ ఆలా ఆగిపోయింది.

అయితే 'బాహుబలి' చిత్రంతో ఇండియా మొత్తం మార్కెట్ ఓపెన్ అవ్వడంతో దక్షిణాది సినిమా మార్కెట్ పరిధి పెరగడంతో మళ్లీ 'పొన్నీయిన్ సెల్వన్'ని తెర పైకి తీసుకురావాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇందు కోసం విక్రమ్ ని కూడా ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ స్టోరీ కి మహేష్ అని అనుకున్నాడు కానీ అది కుదర్లేదు. మహేష్ తరువాత విజయ్- అజిత్- జయం రవి- లేదా విక్రమ్ అనుకున్నాడు చివరికి విక్రమ్ తో 'పొన్నీయిన్ సెల్వన్' తీయడానికి ఫిక్స్ అయ్యాడు. ఈ చిత్రానికి దాదాపు 200-300 కోట్ల మేర ఖర్చు చేయనున్నారన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. విక్రమ్ వరుస వైఫల్యాలతో కెరీర్ పరంగా వెనకపడ్డ ప్రస్తుతం 'మహావీర్ కర్ణ' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ రీసెంట్ గా పూర్తయింది. త్వరలోనే 'పొన్నీయిన్ సెల్వన్' ని సెట్స్ పైకి తీసుకురావాలనే ఆలోచనలో మణిరత్నం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈచిత్రాన్ని ఎవరు నిర్మిస్తాడో తెలియాల్సిఉంది. త్వరలోనే ఆ డీటెయిల్స్ రానున్నాయి.

Similar News