చివరికి క్రిష్ బుక్కయ్యాడుగా..?

క్రిష్ తెలుగులో మంచి దర్శకుడు. గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత క్రిష్ బాలీవుడ్ లో కంగానని పెట్టి మణికర్ణిక చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే కంగనాతో వచ్చిన విభేదాలతో క్రిష్ [more]

Update: 2019-01-26 02:42 GMT

క్రిష్ తెలుగులో మంచి దర్శకుడు. గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత క్రిష్ బాలీవుడ్ లో కంగానని పెట్టి మణికర్ణిక చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే కంగనాతో వచ్చిన విభేదాలతో క్రిష్ మణికర్ణికా నుండి బయటికొచ్చేసాడు. క్రిష్ వెనుక సోను సూద్ కూడా సినిమా నుండి తప్పుకోవడంతో.. కంగనానే దర్శకత్వ బాధ్యతలు తీసుకుని సినిమాని మధ్యలో వదిలెయ్యకుండా పూర్తి చేసి చివరికి నిన్న రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందు కు తీసుకొచ్చింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా.. కంగనా నటనకు, ఆమె డైరెక్షన్ కి ప్రముఖులు నీరాజనాలు పడుతున్నారు. అయితే క్రిష్ 70 శాతం, కంగనా ముప్పై శాతం దర్శకత్వం వహించిన మణికర్ణిక సినిమా ట్రైలర్ విడుదలప్పుడు క్రిష్ ని డైరెక్టర్ గా కంగానని రెండో డైరెక్టర్ టైటిల్ కార్డ్స్ వేశారు.

ఇక తర్వాతర్వాత కంగనా మణికర్ణిక లో మేజర్ క్రెడిట్ తనదేనంటూ స్పీచు ఇవ్వడం, క్రిష్ కి క్రెడిట్ దక్కకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది. క్రిష్ కూడా చానళ్ళు మణికర్ణిక విషయంలో సైలెంట్ గా ఉండి.. కథానాయకుడు ఇంటర్వూస్ లో కంగనా గురించి మట్లాడకుండా మణికర్ణిక టీం చరిత్రను వక్రీకరించిందంటూ మణికర్ణిక మీద నెగెటివ్ వ్యాఖ్యలు చేసాడు. సోను సూద్ మాత్రం చారిత్రాత్మక చిత్రం నుండి బయటికొచ్చి తప్పు చేశానన్నారు. ఇక నిన్న విడుదలైన మణికర్ణికా సినిమా పై బాలీవుడ్ క్రిటిక్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బాలీవుడ్ దిగ్గజాలు కూడా మణికర్ణికా అంత బాగా రావడానికి కంగనానే కారణమంటున్నారు.

ఎక్కడా వారు క్రిష్ పేరు ఉచ్చరించడం లేదు. క్రిష్ పేరు తియ్యకుండా మణికర్ణిక హిట్ క్రెడిట్ మొత్తం కంగనాకు ఆపాదిస్తున్నారు ప్రముఖులు. మరి క్రిష్, కంగనాకు పడకే క్రిష్ తప్పుకున్నప్పటికీ.. కంగానా మాత్రం సినిమాని వదలకుండా పూర్తి చేసినందుకు…. క్రిష్ మధ్యలో వదిలేసినందుకు చాలామంది విమర్శించారు. అందుకే ఇప్పుడు సినిమా విడుదలయ్యాక క్రిష్ కి ఎలాంటి క్రెడిట్ దక్కకుండా కంగనా జాగ్రత్తపడడం కాదు…. బాలీవుడ్ మొత్తం ఏకమై కంగానని హీరోని చేసి క్రిష్ ని తొక్కేశారు. పాపం మణికర్ణిక విషయంలో క్రిష్ తప్పు ఎంతవరకు ఉందొ చెప్పలేం కానీ.. క్రిష్ మాత్రం బాలీవుడ్ వర్గాల చేతుల్లో బాగా బుక్కయ్యాడు.

Tags:    

Similar News