కంగనా సత్తా చూపిస్తోంది..!

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించి డైరెక్ట్ చేసిన మణికర్ణిక గురించే ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లో కూడా చర్చ జరుగుతుంది. [more]

Update: 2019-02-02 10:04 GMT

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించి డైరెక్ట్ చేసిన మణికర్ణిక గురించే ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లో కూడా చర్చ జరుగుతుంది. దాదాపు 70 శాతం ఈ సినిమాను క్రిష్ డైరెక్ట్ చేసాడు. కానీ సినిమాలో తనకు క్రెడిట్ ఇవ్వలేదని చెప్పడం మరింత హిట్ అయింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రస్తుతం కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. బాలీవుడ్ లో ఇప్పుటివరకు వచ్చిన లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో మణికర్ణిక టాప్ లో నిలిచింది.

అగ్రస్థానంలో నిలిచే దిశగా…

మొదటి స్థానంలో తను వెడ్స్ మను 70.5 కోట్లు వసూలు చేసి ఉంటే.. వీరీ దే వెడ్డింగ్ చిత్రం 56.98 కోట్లతో రెండవ స్థానంలో ఉంది. ఇప్పుడు ‘మణికర్ణిక’ మొదటి వారం రోజుల్లోనే 60.15 కోట్లు కలెక్ట్ చేసి రెండవ స్థానంలో నిలిచింది. అయితే ఫుల్ రన్ లో ఈ సినిమా 100 కోట్లను రాబట్టడం ఖాయమని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. ఓవరాల్ గా ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు నిర్మాతకి లాభం వచ్చేలా ఉంది. ఎలాగో శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఓ 50 కోట్లు పైనే వచ్చేలా ఉంది.

Tags:    

Similar News