క్రెడిట్ మొత్తం తీసేసుకుంటోందే..!

కంగనా రనౌత్ మెయిన్ లీడ్ లో నటించి ముప్పై శాతం డైరెక్షన్ చేసిన మణికర్ణిక సినిమా మరికొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదట్లో టాలీవుడ్ దర్శకుడు [more]

Update: 2019-01-24 08:00 GMT

కంగనా రనౌత్ మెయిన్ లీడ్ లో నటించి ముప్పై శాతం డైరెక్షన్ చేసిన మణికర్ణిక సినిమా మరికొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదట్లో టాలీవుడ్ దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో మొదలైన మణికర్ణిక సినిమా చివర్లో కంగనా చేతుల్లోకొచ్చింది. క్రిష్ కొన్నికారణాలతో మణికర్ణిక దర్శకత్వం నుండి తప్పుకోవడంతో… కంగనా మణికర్ణిక డైరెక్షన్ బాధ్యతలను తన చేతుల్లోకి తీసుకుంది. ఇక అప్పటినుండి సినిమా మొత్తం తానే డైరెక్షన్ చేసినట్లుగా కంగనా చెబుతోంది. క్రిష్ కి థాంక్స్ అంటూ నామమాత్రంగా టైటిల్ లో క్రిష్ పేరు వేస్తుంది కానీ.. అది మనస్ఫూర్తిగా చెయ్యలేదు. ఇక దర్శకుడు క్రిష్ కూడా చాలా రోజుల తర్వాత కంగనా గురించి మట్లాడకుండా సోనుసూద్ ఆ సినిమా నుండి బయటికొచ్చేయడం… అనేది సోనుసూద్ తప్పు కాదని.. అంతా కంగనాదే తప్పు అనే అర్ధం వచ్చేలా మాట్లాడాడు.

పొగడ్తలను ఎంజాయ్ చేస్తున్నా…

ఇక తాజాగా సినిమా విడుదల దగ్గర పడేకొద్దీ రాష్ట్రపతికి, ఇంకా చాలామంది ప్రముఖులకు తన మణికర్ణిక సినిమాని స్పెషల్ షోస్ వేసి మరీ చూపిస్తుంది కంగనా. ఇక సినిమా చూసిన ప్రతి ఒక్కరు కంగానా నటనను, డైరెక్షన్ ను తెగ పొగిడేస్తున్నారు. ఇక తన డైరెక్షన్ మీద వస్తున్న పొగడ్తలను బాగా ఎంజాయ్ చేస్తున్న కంగనా.. కేవలం ముప్పై శాతమే దర్శకత్వం చేసింది. మిగిలిన 70 శాతం క్రిష్ డైరెక్షన్ చేసిన మాణికర్ణికను.. అస్సలు క్రిష్ పేరు ఎక్కడ వినబడకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. కనీసం మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా క్రిష్ కి ఎక్కడా కృతజ్ఞత కూడా చెప్పడం లేదు.

సంవత్సరం కష్టపడితే…

ఇక మణికర్ణిక రైటర్ టాలీవుడ్ రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా కంగనా డైరెక్షన్ గురించి కథలు కథలుగా చెబుతున్నాడు కానీ.. క్రిష్ ముచ్చట మాత్రం తియ్యడం లేదు. మరి కంగనాకు ఉన్న ఈ నియంతృత్వ పోకడని భరించలేకే క్రిష్ చల్లగా మణికర్ణిక డైరెక్షన్ బాధ్యత నుండి తప్పుకున్నట్టుగా స్పష్టమవుతుంది. పాపం ఏడాది కాలం క్రిష్ మణికర్ణిక కోసం పడిన కష్టం అంతా కంగనా ఓవర్ యాక్షన్ లో పడి కొట్టుకుపోయింది. పాపం క్రిష్ ఇక్కడ… ఎన్టీఆర్ కథానాయకుడు దెబ్బకి విలవిలలాడుతుంటే.. అక్కడ మణికర్ణిక గోల ఒకటి.

Tags:    

Similar News