మణిశర్మ ని తక్కువ అంచనా వేస్తే అలానే ఉంటది

మొన్నటివరకు దేవి అండ్ తమన్ ఇద్దరు టాలీవుడ్ ని ఏలేశారు. పెద్ద సినిమాల నుండి మీడియం సినిమాల వరకు ఈ ఇద్దరే కనిపించేవారు. అటువంటి వీరు ఈమధ్య [more]

Update: 2019-07-26 06:05 GMT

మొన్నటివరకు దేవి అండ్ తమన్ ఇద్దరు టాలీవుడ్ ని ఏలేశారు. పెద్ద సినిమాల నుండి మీడియం సినిమాల వరకు ఈ ఇద్దరే కనిపించేవారు. అటువంటి వీరు ఈమధ్య నాసిరకం పాటలు ఇస్తున్నారు. వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ పెద్దగా లేకపోవడంతో చేసేది ఏమిలేక దర్శకనిర్మాతలు వీరినే పెట్టుకుంటున్నారు.

అయితే రీసెంట్ గా వీరిని సైడ్ కి పంపడానికి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ వచ్చారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన మణి అందరి నోరులు మూపించాడు. మణి పని అయిపొయింది అనుకున్న టైములో తనలో ఇంకా చాలా పస వుందని మణి నిరూపించాడు. ఇస్మార్ట్ శంకర్ కి అతను ఇచ్చిన సాంగ్స్ కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కానీ హైలైట్ అని చెప్పాలి.

ఇప్పుడు మణిశర్మ మళ్లీ పుంజుకోవడం దేవి, తమన్‌ ఇద్దరికీ షాకే. ఇప్పుడు పెద్ద సినిమా ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ మణి డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. మణి ఒక భారీ బడ్జెట్ మూవీ వస్తే దేవి అండ్ తమన్ ల కి ప్రమాద ఘంటికలు మోగినట్టే. కానీ మణిశర్మ పెద్ద సినిమాలు చేయను అని ఆమధ్య ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు.

Tags:    

Similar News