డైరెక్టర్ – హీరో మంచు విష్ణు ప్యాచప్ అయ్యారా?

మంచు హీరో విష్ణు అసలే డిజాస్టర్స్ తో కొట్టుమిట్టాడుతున్నాడు. దానికి తగ్గట్టు మంచు విష్ణు తన సినిమాని తానే చంపేసుకున్నాడనే టాక్ ఉంది. ఏకంగా మంచు విష్ణు [more]

Update: 2019-06-12 06:09 GMT

మంచు హీరో విష్ణు అసలే డిజాస్టర్స్ తో కొట్టుమిట్టాడుతున్నాడు. దానికి తగ్గట్టు మంచు విష్ణు తన సినిమాని తానే చంపేసుకున్నాడనే టాక్ ఉంది. ఏకంగా మంచు విష్ణు సినిమా ఓటర్ ని డైరెక్ట్ చేసిన కార్తీక్ ఒక వీడియో ని తయారు చేసి మీడియాకి పంపాడు. ఆ వీడియో లో తాను మంచు విష్ణు హీరోగా ఓటర్ సినిమాని తెరకెక్కించానని.. కానీ ఓటర్ సినిమా మంచు మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ సినిమాలోని కొన్ని సీన్స్ వాడారని.. అందుకే అసెంబ్లీ రౌడీ సినిమా హక్కులకింద దర్శకుడు కార్తీక్ ఎంతో కొంత చెల్లించకపోతే ఓటర్ సినిమాని విడుదల కానివ్వమని మంచు విష్ణు కార్తీక్ ని బెదిరించినట్లుగా కార్తీక్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఆ విషయమై మంచు విష్ణు కానీ ఓటర్ యూనిట్ కానీ ఎక్కడ స్పందించలేదు.

ఎప్పుడో ఏప్రిల్ లో విడుదల కావాల్సిన ఓటర్ సినిమా వివాదాల మధ్యన ఇప్పటికి విడుదల కాలేదు. తాజాగా ఈనెల 21 న ఓటర్ సినిమా విడుదల అంటూ ఓ గాసిప్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే ఓటర్ యూనిట్ నుండి మాత్రం ఇంకా ఎటువంటి క్లారిటీ ఓటర్ విడుదల విషయంలో లేదు. అయితే నిజంగా ఓటర్ సినిమా విడుదలకు డేట్ ప్రకటిస్తారనుకుంటే.. దర్శకుడు కార్తీక్ హీరో మంచు విష్ణు ప్యాచప్ అయితేనే అది జరుగుతుంది. మరి కేవలం కోటిన్నర కోసం మంచు విష్ణు తన సినిమాని తానే విడుదల ఆపుకున్నాడంటే.. ఇప్పుడు మాత్రం విడుదల కానిస్తాడా? అనేది పెద్ద డౌట్. ఏదైనా ఇలా ఓ చిన్న కారణానికే సినిమా విడుదల కాకుండా అడ్డుకోవడమంటే మాత్రం అది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమే.

Tags:    

Similar News