Manchu vishnu : రాజీనామాలపై అదే నిర్ణయమా?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలను స్వీకరించారు. మాజీ అధ్యక్షుడు నరేష్ నుంచి ఆయన బాధ్యతలను చేపట్టారు. ఇటీవల జరిటిన మా ఎన్నికల్లో మంచు [more]

Update: 2021-10-13 06:57 GMT

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలను స్వీకరించారు. మాజీ అధ్యక్షుడు నరేష్ నుంచి ఆయన బాధ్యతలను చేపట్టారు. ఇటీవల జరిటిన మా ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంచు విష్ణుతో పాటు రఘుబాబు కూడా బాధ్యతలను చేపట్టారు.

రాజీనామాలపై నిర్ణయం?

ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు చెందిన 11 మంది సభ్యులు రాజీనామా చేశారు. దీనిపై మంచు విష్ణు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మంచు విష్ణు అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టడంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. రాజీనామాలను ఆమోదిస్తే మంచు విష్ణు వారి స్థానంలో కొత్త వారిని నియమించుకునే వీలు బైలాస్ లో ఉంది. మరి మంచు విష్ణు రాబోయే కొద్ది గంటల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News