యోగా ప్రమోటర్ గా మంచు లక్ష్మి

Update: 2018-06-06 08:29 GMT

మోడ్రన్ లైఫ్ స్టైల్ లో యోగా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఒత్తిడితో నిండిన జీవన విధానం, బరువు తగ్గించుకోవడం.. వంటి సమస్యలతో పోరాడేందుకు యోగా శక్తి వంతమైన ఆయుధంగా మారింది. అయితే యోగాలన్నీ ఒక్కటేనా ..? అంటే కచ్చితంగా కాదు అనుకోవాలి. శాస్త్రీయమైన యోగా కేంద్రాలు అరుదుగా దొరుకుతాయి. యోగాను తమ జీవితంగా మార్చుకున్న ప్రొఫెషనల్ ట్రైనర్స్ కూడా కొంతమందే ఉంటారు. యోగాను పూర్తిగా అర్ధం చేసుకొని దానిని ఫిజికల్ ప్లెక్సిబిలిటీ పెంచే సాధనంగా మాత్రమే కాకుండా మానసికమైన ఒత్తిడులును తగ్గించే మంత్రంగా మార్చడానికి శాస్త్రీయ విధానాలు తెలిసిన వారికే సాధ్యం అవుతుంది. ఆ కోవకు చెందినదే హటమ్ స్టూడియో . ఇషా ఫౌండషన్ నుండి ట్రైనర్ గా సర్టిఫై అయిన ఉషా మూర్తినేని మంచు లక్ష్మికి యోగాలో శిక్షణ ఇస్తున్నారు. ఉషా మూర్తినేని నిర్వహిస్తున్న హటమ్ స్టూడియోకు మంచు లక్ష్మి అతిథిగా విచ్చేసారు. కొద్దిసేపు తను ఆ స్టూడియో లో యోగా ను ప్రాక్టీస్ చేసి తన అనుభవాలను స్టూడెంట్స్ తో పంచుకున్నారు.

యోగా జీవితంలో భాగమైంది...

ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ... ‘‘యోగా తన జీవితంలో భాగం అయినప్పటి నుండి తన జీవితంపై పూర్తి నియంత్రణ వచ్చింది. రోజూ ఇన్ని పనులు మేనేజ్ చేయగలుగుతున్నానంటే దానికి కారణం యోగా మాత్రమే. ఎవరి జీవితంలోకి అయినా యోగాను అనుమతిస్తే వారి జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి. యోగా అంటే అది మన సంస్కృతి, మన పెద్దలు మనకు ఇచ్చిన ఆస్తి. ఇలాంటి యోగా సెంటర్స్ అవసరం సొసైటికి చాలా ఉంది.’’ అన్నారు.

Similar News