నెటిజన్ల మనస్సులు దోచుకుంటున్న ‘మంచు’ కుటుంబం

Update: 2018-09-04 10:41 GMT

సాధారణంలో సెలబ్రిటీలు ఏదైనా తప్పుగా లేదా పొరపాటుగా మాట్లాడి నెటిజన్లకు దొరికితే అస్సలు ఊరుకోరు. వారిని సోషల్ మీడియా వేదికగా నానా రకాలు ట్రోల్ చేస్తుంటారు. ఇలానే నెటిజన్లకు దొరికిపోయారు నటుడు మోహన్ బాబు. ఆయన గతంలో ఆ జాతీయ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో సదరు ఛానల్ యాంకర్ ఏదైనా డైలాగ్ ను ఇంగ్లీష్ లో చెప్పమన్నారు. దీంతో తన నటించిన సినిమాలోని ఓ డైలాగ్ ను ఇంగ్లీష్ లో చెబుతూ ‘ఫసక్’ అనే పదం వాడారు మోహన్ బాబు. మోహన్ బాబు వాడిన ‘ఫసక్’ అనే పదంతో సోషల్ మీడియాలో నెటిజన్లు మేమ్ లు, స్ఫూఫ్ వీడియోలు పెడుతూ మోహన్ బాబును దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

తిట్టినా... పొగిడినా మీరే..!

అయితే, ఈ ట్రోల్స్ పై మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు మనోజ్ స్పందించారు. వీరి స్పందనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వారు ట్రోల్స్ పై ఏమాత్రం సీరియస్ కాకపోగా, మెచ్చుకున్నారు. ‘ఫసక్’ ట్రెండింగ్ గా మారడం గురించి విష్ణు చెప్పారని, సుమారు 200 స్ఫూఫ్ వీడియోలు కూడా వచ్చాయని తెలిసిందని మోహన్ బాబు పేర్కొన్నారు. వాటిలో కొన్ని చూశానని, చాలా క్రియేటీవ్ గా, ఫన్నీగా ఉన్నాయని మోహన్ బాబు ట్వీట్ చేశారు. ఇక మంచు మనోజ్ కూడా స్పందించారు. ‘తిట్టినా, పొగిడినా, అడుక్కున్నా మీరే కదా బ్రదర్స్... మీరు పెట్టే కూడు తింటున్నాం... మీకు ఆ హక్కు ఉంది. ఎంజాయ్. ఫసక్’ అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు. దీంతో ట్రోల్స్ పై వీరిద్దరి స్పందనకు నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Similar News