జూనియర్ హన్సికేనా?

Update: 2018-05-18 06:08 GMT

దేశముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా హన్సిక పాలబుగ్గలు, సొట్టబుగ్గల చిన్నదిగా అందరి మనసుల్లోనూ మంచి ముద్ర వేసింది. అయితే అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో నటించినా కూడా హన్సిక స్టార్ హీరోయిన్ అవ్వలేకపోయింది. అయితే తెలుగులో హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయినా కోలీవుడ్ లో మాత్రం హన్సికకు మంచి క్రేజ్ ఉంది. అక్కడ శింబుతో ప్రేమాయణం, అలాగే తమిళ తంబిల ఆరాధ్యదేవతగా ఒక వెలుగు వెలిగింది. ఇక ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్న హన్సికకు స్టార్ హీరోల సరసన మాత్రం అవకాశాలు రావడం లేదు. ఎందుకంటే ఆమె బరువు ఆమెకి అవకాశాలు దూరం చేసింది. అయితే ఇప్పుడు హన్సిక మాదిరి మరో అమ్మాయి తెలుగు తెరకు పరిచయం కాబోతుంది.

హన్సికను మరిపించేలా...

నేలటికెట్ సినిమాలో రవితేజకి జోడిగా తెలుగు తెరకు పరిచయమవుతున్న మాళవిక శర్మని చూస్తుంటే అచ్చం జూనియర్ హన్సిక అనిపించేలా కనబడుతుంది. బొద్దుతనం, బూరి బుగ్గలు అలాగే స్ట్రెక్చెర్ ఇవన్నీ హన్సిక మాదిరిగా కనబడుతున్నాయి. మాళవిక శర్మ నేల టికెట్ సినిమా లో డాక్టర్ పిల్లగా నటిస్తుంది. మరి ఏ యాంగిల్ లో చూసినా మాళవిక హన్సికని పోలినట్టుంది అంటున్నారు. మరి అమ్మడు మాళవిక శర్మకి నేలటికెట్ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో గాని ప్రస్తుతం అయితే ఆమె పేరు యంగ్ హీరోల పక్కన అయితే వినబడుతుంది. చూద్దాం మాళవిక శర్మకి టాలీవుడ్ లో ఎన్నాళ్లుండే అవకాశం ఉంటుందో.

Similar News