మజిలీ ప్రీరిలీజ్ బిజినెస్ అదిరిందిగా..!

నాగ చైతన్య – సమంత కలిసి నటిస్తున్న చిత్రం మజిలీ. పెళ్లి తరువాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం కాబట్టి ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. అందుకే ఈ [more]

Update: 2019-03-07 08:16 GMT

నాగ చైతన్య – సమంత కలిసి నటిస్తున్న చిత్రం మజిలీ. పెళ్లి తరువాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం కాబట్టి ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరుగుంతుంది. టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా శాటిలైట్ ను జెమినికి 5 కోట్ల రేంజ్ లో ఇచ్చేసారు. డిజిటల్ రైట్స్ అమెజాన్ కు మూడున్నర కోట్లకు, హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా మంచి రేటుకు ఇచ్చేసినట్లు తెలుస్తోంది. నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో చైతు, సామ్ భార్యాభర్తల పాత్రల్లో కనిపించనున్నారు.

క్రికెటర్ గా చైతు…

ఇందులో చైతు క్రికెటర్ గా కనిపించనున్నాడు. దివ్యాంశ కౌశిక్ కీలక పాత్రలో కనిపిస్తుంది. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ 5న అంటే కరెక్ట్ గా ఎగ్జామ్స్ అన్ని అయిపోయి వేసవి సెలవుల్లో ఈ సినిమా రిలీజ్ అవ్వడం ప్లస్ గా మారింది. ఇక ఏప్రిల్ లో తేజు చిత్రలహరి కూడా ఉంది. అలానే మజిలీకి ముందు వారం నిఖిల్ ‘అర్జున్ సురవరం’ రిలీజ్ కానుంది.

Tags:    

Similar News