మజిలీ విడుదల ఆగనుందా..?

పెళ్లి తరువాత సామ్ – చైతు ఇద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం మజిలీ. వారు భార్యాభర్తలుగా నటిస్తున్న ఈ సినిమాను శివ నిర్వాణ రూపొందిస్తున్నారు. తొలి పోస్టర్ [more]

Update: 2019-03-22 11:27 GMT

పెళ్లి తరువాత సామ్ – చైతు ఇద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం మజిలీ. వారు భార్యాభర్తలుగా నటిస్తున్న ఈ సినిమాను శివ నిర్వాణ రూపొందిస్తున్నారు. తొలి పోస్టర్ నుండే అంచనాలు ఉన్న ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా రికార్డు సృష్టించింది. సినిమాలో సామ్ – చైతు మధ్య వచ్చే సీన్స్ హైలైట్ గా నిలుస్తాయని టాక్. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అటు బిజినెస్ పరంగా, క్రేజ్ పరంగా ఈ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ ఉంది. అయితే ఈ తరణంలో ఈ చిత్ర విడుదల ప్రశ్నార్థకంలో పడిపోయిందని వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందించారు.
రీరికార్డింగ్ పూర్తికాకపోవడంతో…

రీ రికార్డింగ్ కూడా అతనే చేయాలి కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కావడం కఫ్టంగా మారింది. వెంటనే అలెర్ట్ అయిన టీం యువ సంగీత సంచలనం తమన్ ను సంప్రదించారని, తను రీరికార్డింగ్ చేయడానికి ఓకే చెప్పినట్టు తెలిసింది. తమన్ రీ రికార్డింగ్ లో ఎక్స్పర్ట్. లవ్ స్టోరీస్ కి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్ హైలైట్ గా నిలిచినా సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ నిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు.

Tags:    

Similar News