మజిలీ వాయిదా పడనుందా..?

సమంత – నాగచైతన్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మజిలీ మూవీలో చైతూ, సామ్ భార్యాభర్తలుగా నటిస్తున్నారు. పీరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నిన్ను కోరి [more]

Update: 2019-03-13 07:48 GMT

సమంత – నాగచైతన్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మజిలీ మూవీలో చైతూ, సామ్ భార్యాభర్తలుగా నటిస్తున్నారు. పీరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం చేసాడు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రెండు సాంగ్స్ ఆల్రెడీ యూత్ లో మారుమోగిపోతున్నాయి. ఇక ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదల చేస్తున్నామని మేకర్స్ ప్రటించారు. అయితే ఇక్కడే టీంకు ఓ సమస్య వచ్చింది.

ఎన్నికలు ఉండటంతో…

ఏప్రిల్ 11న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మజిలీకి కష్టాలు తప్పేలా లేవని అంటున్నారు. ఎన్నికలు ఈ సినిమాపై ప్రభావం చూపనుంది. అందుకే ఈ పరిస్థితుల్లో మజిలీని చెప్పిన డేట్‌కే రిలీజ్ చేయటం కన్నా వాయిదా వేస్తే బెస్ట్ అని అభిమానులు అంటున్నారు. అందుకే ఎన్నికల రోజు విడుదల కావాల్సిన నాని జెర్సీ సినిమాను ఇప్పటికే ఏప్రిల్‌ 19కి వాయిదా వేశారు. అందుకే మజిలీ సినిమా కూడా వాయిదా వేస్తే బెటర్ అని అంటున్నారు. మరి మేకర్స్ ఏం ఆలోచిస్తారో చూడాలి.

Tags:    

Similar News