మజిలీ సినిమా ఫస్ట్ టాక్..!

నాగ చైతన్య – సమంత – దివ్యాంశ కలయికలో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన మజిలీ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రికెట్, ప్రేమ, పెళ్లి [more]

Update: 2019-04-05 06:19 GMT

నాగ చైతన్య – సమంత – దివ్యాంశ కలయికలో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన మజిలీ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రికెట్, ప్రేమ, పెళ్లి విషయాల చుట్టూ సాగే రొమాంటిక్, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా టాక్ ఓసారి చూద్దాం. నాగచైతన్యకి క్రికెట్ అంటే ప్రాణం. కానీ తండ్రి రావు రమేష్ కెరీర్ ని డిసైడ్ చేసుకోమని ఓ సంవత్సరం డెడ్ లైన్ పెడతాడు. చైతు క్రికెటర్ గా మంచి ఫామ్ లో ఉండగా దివ్యాంశ కౌశిక్ పరిచయం అవుతుంది. స్ట్రిక్ట్ గా ఉండే నేవీ ఆఫీసర్ అతుల్ కూతురు దివ్యాంశ. చైతు, దివ్యాంశ పరిచయం స్నేహంగా మొదలై ఆ తర్వాత ప్రేమగా మారుతుంది. కొన్ని కారణాల వలన దివ్యాంశ – చైతు విడిపోతారు.

ఆకట్టుకునే కథతో…

చైతు జీవితంలోకి ఆనుకోకుండా సమంత ప్రవేశిస్తుంది. ఇక తర్వాత సాగే ఫ్యామిలీ డ్రామానే మజిలీ సినిమా. నాగ చైతన్య మాస్, క్లాస్ లుక్ లో రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో పూర్ణగా మంచి నటన కనబర్చగా.. శ్రావణిగా సమంత లుక్స్ లో, ఎమోషనల్ గా కట్టిపడేసే నటనలోనూ అదరగొట్టేసింది. భావోద్వేగ కథను చాలా సున్నితంగా మనసులకు హద్దుకునేలా శివ నిర్వాణ అద్భుతంగా తీసినప్పటికీ.. సెకండ్ హాఫ్ లో సాగదీత సన్నివేశాలు ప్రేక్షకుడిని కాస్త ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. ఇక గోపి సుందర్ మ్యూజిక్ సో సో గా ఉండగా.. థమన్ నేపధ్య సంగీతం మాత్రం అదరగొట్టేసింది.

Tags:    

Similar News