‘మజిలీ’ హిట్ అయినా వృధానే..?

గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మజిలీ సినిమా ప్రేక్షకులకు కాస్త ఊరటనిచ్చింది. గత రెండు నెలలుగా నెలకొన్న సినిమా కరువును మజిలీ కొంతవరకు తీర్చింది. థియేటర్స్ [more]

Update: 2019-04-11 11:01 GMT

గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మజిలీ సినిమా ప్రేక్షకులకు కాస్త ఊరటనిచ్చింది. గత రెండు నెలలుగా నెలకొన్న సినిమా కరువును మజిలీ కొంతవరకు తీర్చింది. థియేటర్స్ అన్నీ బోసిపోయిన టైంలో వచ్చిన మజిలీ బాగానే క్యాష్ చేసుకుంది. ఫస్ట్ వీకెండ్ లో ఫుల్ బుకింగ్స్ తో కేవలం నాలుగు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన మజిలీ సినిమా సోమవారం కూడా బుకింగ్స్ పరంగా బాగానే ఉంది. కానీ మంగళవారం నుండి మజిలీ సినిమా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. మంగళవారం నుండి థియేటర్స్ లో ప్రేక్షకుల హడావిడి తగ్గింది. మజిలీ సినిమా కమర్షియల్ గా ఒక వర్గం ప్రేక్షకులను మెప్పించలేకపోయిందని.. బీ, సీ సెంటర్స్ కన్నా మల్టిప్లెక్స్ ఆడియన్స్ కి ఈ సినిమా కనెక్ట్ అయ్యిందని.. అందుకే మంగళవారం నుండి కలెక్షన్స్ లో డ్రాప్ కనబడుతుంది అని అంటున్నారు.

చైతూ కెరీర్ లో పెద్ద సినిమాగా

ఇక బ్రేక్ ఈవెన్ సాధించినా నాగ చైతన్య గత సినిమాల లెక్కలోనే మజిలీ కూడా ఉంటుందని.. కానీ నాగ చైతన్య కెరీర్ లో ఇదే బిగ్గెస్ట్ హిట్ గా నిలవదని అంటున్నారు. మజిలీ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టినా ఓ అన్నంత లాభాలేం నిర్మాతలకు రావని అంటున్నారు. కాకపోతే చైతు కెరీర్ లో మంచి చిత్రంగా మజిలీ సినిమా నిలిచిపోతుందని మాత్రం చెబుతున్నారు. ఇక ఎన్నికల రోజున సెలవు వచ్చింది కానీ అందరూ ఓట్ వేసే మూడ్ లో థియేటర్స్ కి వచ్చే అపరిస్థితి అంతగా ఉండదు. కాబట్టి ఈ రోజు హాలిడే మజిలీకి పనికిరాదు.

Tags:    

Similar News