మజిలీ అక్కడ పికప్‌ అవ్వలేదు..!

చైతు – సామ్ జంటగా నటించిన మజిలీ చిత్రం చైతు కెరీర్ లోనే బెస్ట్ చిత్రంగా నిలవడం ఖాయమని అనుకున్నారు. మంచి చిత్రమే అయినప్పటికీ వసూళ్లపరంగా డల్ [more]

Update: 2019-04-16 07:33 GMT

చైతు – సామ్ జంటగా నటించిన మజిలీ చిత్రం చైతు కెరీర్ లోనే బెస్ట్ చిత్రంగా నిలవడం ఖాయమని అనుకున్నారు. మంచి చిత్రమే అయినప్పటికీ వసూళ్లపరంగా డల్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో పక్కన పెడితే యుఎస్‌లో ఈ చిత్రం ఢీలాపడింది. చైతు సోలో హీరోగా నటించిన సినిమాల్లో అత్యధిక గ్రాస్‌ సాధిస్తుందని అనిపించింది కానీ అది జరిగేలా కనిపించడం లేదు. నిజానికి తొలి వారంలో ఊపు చూసి మిలియన్‌ డాలర్లు ఖాయమని కూడా అనేసుకున్నారు. రెండో వారం నుండి ఈ సినిమా పికప్‌ అవలేదు. దీంతో రెండో వారాంతంలో అత్తెసరు వసూళ్లు మాత్రమే వచ్చాయి. మిలియన్‌ డాలర్లు కాకపోయినా ప్రేమమ్‌ వసూళ్లని అయినా దాటుతుందని అనుకుంటే అదీ కష్టమని తేలిపోయింది.

ఇక్కడ ఓకే కానీ…

ఈ చిత్రం ప్రేమమ్ ను దాటాలంటే మరో యాభై ఎనిమిది వేల డాలర్లు వస్తే తప్ప ఆ మజిలీ చేరడం కష్టం. ప్రస్తుతం ఉన్న ఊపు ప్రకారం అది కష్టమే అని అర్ధం అవుతుంది. దానికి తోడు వచ్చేవారం నాని జెర్సీ రిలీజ్‌ అవుతుంది కనుక మజిలీకి ఇక థియేటర్లు దొరికే ఛాన్స్‌ కూడా ఉండదు. కాబట్టి ఎలా చూసిన ఆ వసూలు టార్గెట్ అందుకోవడం కష్టమే అని అర్ధం అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఆలా లేదు. ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ కలెక్షన్స్ ని వెనక్కి నెట్టేసి మజిలీ సినిమా నాగచైతన్య సినిమాల్లో ప్రథమ స్థానం దక్కించుకుంది.

Tags:    

Similar News