‘మజిలీ’లో హైలైట్ అదేనట..!

‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య – సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘మజిలీ’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఏప్రిల్ లో [more]

Update: 2019-01-17 11:04 GMT

‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య – సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘మజిలీ’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఏప్రిల్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఇప్పటికే 50 శాతం పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇది 1990 నాటి ప్రేమకథ నేపథ్యంలో సాగే కథ అని చెబుతున్నారు. చైతు – సామ్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ మూవీలో చైతు సమంతతో పెళ్లికి ముందు ఒక లుక్ తో పెళ్లి తరువాత మరొక లుక్ లో కనిపిస్తుందని టాక్.

పెళ్లి తర్వాత మొదటి చిత్రం

గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా లో దివ్యాంశ కౌశిక్ ఓ కీలక పాత్ర లో కనిపించనుంది. పెళ్లి తర్వాత చైతు, సామ్ చేస్తున్న చిత్రం కాబట్టి ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. శివ వీరి పాత్రలను బాగా తీర్చిదిద్దాడని చెబుతున్నారు. మిగిలిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ డీసెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News