జెర్సీ కోసం ఎదురు చూస్తున్న సీత

ఈ సమ్మర్ లో సీజన్ లో ప్రేక్షకులని కూల్ చేయడానికి అప్పుడే రెండు మీడియం రేంజ్ సినిమాలు వచ్చేసాయి. చైతు – సామ్ నటించిన మజిలీ సినిమా [more]

Update: 2019-04-14 10:53 GMT

ఈ సమ్మర్ లో సీజన్ లో ప్రేక్షకులని కూల్ చేయడానికి అప్పుడే రెండు మీడియం రేంజ్ సినిమాలు వచ్చేసాయి. చైతు – సామ్ నటించిన మజిలీ సినిమా మంచి టాక్ తో మంచి వసూల్ తో దూసుకుపోతుంది. అలానే ఈ వారం రిలీజ్ చిత్రలహరి కి యావరేజ్ టాక్ నడుస్తుంది.
ఇక వచ్చేవారం నాని జెర్సీ అండ్ కాంచన 3 విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఆ పై వచ్చేవారం అంటే 24న 'సీత' రాబోతోంది. అయితే సీత వచ్చేది రానిది అనేది వచ్చేవారం సినిమాల రిజల్ట్ పై ఆధారపడి వుంది.ఎందుకంటే మార్కెట్ లో ఆల్రెడీ మజిలీ కు మంచి వసూల్ తో స్టాండర్డ్ గా నడుస్తుంది. చిత్రలహరి కూడా పర్లేదు అనిపించుకుంది.

ఈ రెండు కాకుండా జెర్సీ సినిమా వచ్చేవారం రిలీజ్ అవుతుంది. ఈ మూడు వసూళ్లను పంచుకుంటాయి. అలానే కాంచన 3కి మాస్ లో గిరాకీ బాగుండే అవకాశాలు ఉన్నాయి. సో ఇంతటి పోటీ మధ్య తేజ డైరెక్ట్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ – కాజల్ జంటగా నటించిన సీత సినిమా వదలడం తేజకు ఇష్టం లేదు. కొంచం లేట్ అయినా పర్లేదు మంచి టైములో ఎటువంటి పోటీ లేని టైములో రిలీజ్ చేయాలనీ చూస్తున్నాడట. ఒకవేళ జెర్సీ అండ్ కాంచన 3 రిజల్ట్ ఏమన్నా తేడాగా వస్తే సీత అనుకున్న డేట్ కె రిలీజ్ అవుతుంది. సో సీత రిలీజ్ ఎప్పుడో తెలియాలంటే వచ్చే వారం రిలీజ్ అయ్యే జెర్సీ కోసం వెయిట్ చేయాల్సిందే

Tags:    

Similar News